Uber Cab Fare: ఫోన్‌లో ఛార్జింగ్ తక్కువగా ఉంటే ఛార్జ్‌ల మోత, జేబులకు చిల్లు పెడుతున్న ఊబర్ - షాకింగ్ రిపోర్ట్
Uber Cab Fare: మొబైల్‌లో ఛార్జింగ్ ఆధారంగా ఊబర్ రైడ్ ఛార్జ్‌లు నిర్ణయిస్తోందని ఓ రిపోర్ట్ ఆరోపించింది.
Uber Cab Fare:
కేస్ స్టడీ
మీరు రెగ్యులర్‌గా ఊబర్ బుక్ చేసుకుంటారా..? అయితే ఓ సారి మీ మొబైల్ ఛార్జింగ్ ఎంతుందో చెక్ చేసుకోండి. ఆ తరవాతే రైడ్ బుక్ చేయండి. పొరపాటును ఛార్జింగ్ తక్కువగా ఉందంటే మాత్రం మీ జేబుకి చిల్లు పడిపోతుంది. డిస్టెన్స్ తక్కువే అయినా మీరు చెల్లించుకోవాల్సిన మొత్తం భారీగానే ఉంటుంది. ఇదేం లాజిక్...? అనే డౌట్ వస్తుంది కదా. మీకేంటి అందరికీ ఇదే అనుమానం. బెల్జియంలోని Belgian Newspaper ఓ సంచలన రిపోర్ట్ వెల్లడించింది. ఓ కేస్ స్టడీని ప్రస్తావించింది. స్మార్ట్‌ఫోన్‌లో 80%కి పైగా ఛార్జింగ్ (Mobile Battery) ఉన్న మొబైల్ నుంచి ఊబర్ రైడ్ బుక్ చేసుకున్న వాళ్లతో పోలిస్తే...12% ఛార్జింగ్ ఉన్న మొబైల్‌తో రైడ్ బుక్ చేసుకునే వాళ్లకు ఫేర్ ఎక్కువగా చూపిస్తోందని తెలిపింది. అంటే ఛార్జింగ్ తక్కువగా ఉన్న వాళ్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. అంతే కాదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...iOS,ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనూ ఈ ఫేర్ వేరువేరుగా చూపిస్తోంది. ఒకే రైడ్‌కి iOSలో ఓ ఫేర్, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మరో ఫేర్ కనిపిస్తున్నట్టు ఈ రిపోర్ట్ తెలిపింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్ (Brussels)లో ఈ స్టడీ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో భాగంగా సేమ్ లొకేషన్‌కి రెండు వేరు వేరు ఫోన్లలో రైడ్ బుక్ చేశారు. 84%పైగా ఛార్జింగ్ ఉన్న ఫోన్‌లో ధర తక్కువగా ఉండగా...12% బ్యాటరీ ఉన్న ఫోన్‌లో ఆ ఫేర్ ఎక్కువగా చూపించింది. అయితే...ఊబర్ మాత్రం ఈ నివేదికపై అసహనం వ్యక్తం చేస్తోంది. బ్యాటరీ ఆధారంగా ఫేర్ నిర్ణయిస్తున్నారన్న ఆరోపణల్ని ఖండించింది. డిమాండ్ ఆధారంగానే ఫేర్ నిర్ణయిస్తామని తేల్చి చెప్పింది. ఇందులో ఎలాంటి మోసం లేదని స్పష్టం చేసింది.
"ఓ ట్రిప్ ధరకు, యూజర్స్ ఫోన్ బ్యాటరీకి ఎలాంటి సంబంధం లేదు. ఊబర్‌లో రైడ్స్ బుక్ చేసుకునే వారికి ఆ లొకేషన్‌లో ఉన్న డిమాండ్ ఆధారంగానే ఫేర్‌లు నిర్ణయిస్తాం. ఎంత మంది డ్రైవర్‌లు ఆ రైడ్‌కి రెస్పాండ్ అవుతారు అన్న ఆధారంగానే ఫేర్ ఉంటుంది"
- ఊబర్ యాజమాన్యం
గతంలోనూ ఆరోపణలు..
ఇప్పుడే కాదు. గతంలోనూ ఊబర్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. 2016లో ఆ కంపెనీ మాజీ ఎకనామిక్ రీసెర్చ్ కీత్ చెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది యూజర్స్ డిమాండ్‌కు తగ్గట్టుగా ఎక్కువ మొత్తంలో చెల్లించేందుకూ రెడీగా ఉంటున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యంగా బ్యాటరీ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్లు ప్రైస్ సర్జ్‌ని లెక్క చేయడం లేదని అన్నారు. కానీ...బ్యాటరీ లెవెల్స్ ఆధారంగా ప్రైస్ సర్జ్ చేస్తున్నారన్న ఆరోపణలను మాత్రం ఖండించారు. కంపెనీ ఎంతగా కొట్టి పారేస్తున్నప్పటికీ...ఊబర్ బ్యాటరీ లెవెల్స్‌కి సంబంధించిన వివరాలనూ అక్రమంగా సేకరిస్తోందని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇది కచ్చితంగా ప్రైవసీకి భంగం కలిగిస్తుందని చెబుతున్నారు. ఊబర్ పాలసీల్లో పారదర్శకత లేదని మండి పడుతున్నారు.
Also Read: Wheat: గోధుమల ఎగుమతిపై నిషేధం కొనసాగింపు, ధరలు దిగొచ్చేవరకు ఇదే పరిస్థితి