Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, 10 మంది మృతి
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత7.8గా నమోదు కాగా 10 మంది చనిపోయారు. ఏడు నుంచి ఎనిమిది అపార్ట్ మెంట్లు పేకముక్కల్లా కుప్పకూలిపోయాయి.
![Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, 10 మంది మృతి Turkey Earthquake Updates Ten Member Died 8 Apartments Collapsed After Powerful Earthquake Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, 10 మంది మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/06/dd65e248980abf17ee2a372bd7b01ada1675656694303519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీలోని నూర్ద్గికి తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో భూకంపం రాగా.. అనేక భవనాలు కూలిపోయాయి. పేక మేడల్లో భవనాలు పడిపోతుంటే ప్రజలు అలాగే చూస్తుండిపోయారు. భవనాల్లో ఉన్నవారిలో పలువురు చనిపోగా.. శిథిలాల కింద ఇరుక్కుపోయిన కొందరిని పోలీసులు వెలికి తీస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ప్రమాదంలో దాదాపు 10మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఉస్మానియాలో ఐదుగురు, సాన్లియూర్ఫాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదు అయింది. దక్షిణ టర్కీలో ఈ భూకంపం సంభవించింది. ఇక్కడ చాలా అపార్ట్‌మెంట్లు కూలిపోయాయి. ముఖ్యంగా 14 నుంచి 17 అంతస్తులు ఉన్న భవనాలను ఒక్కసారిగా పడిపోయాయి. అయితే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచిస్తున్నారు. భూకంపం తర్వాత టర్కీ ప్రభుత్వం అంతర్జాతీయ సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. టర్కీ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:17 గంటలకు 17.9 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. అదే సమయంలో, దక్షిణ టర్కీలోని గాజియాంటెప్ సమీపంలో సోమవారం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. దీంతో టర్కీ, సిరియాలో పెను నష్టం వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి.
Multiple apartment buildings have collapsed after a powerful earthquake in southern Turkey pic.twitter.com/wydrBj94RL
— BNO News (@BNONews) February 6, 2023
టర్కీలో హై అలర్ట్ ప్రకటన..!
శక్తివంతమైన భూకంపం తర్వాత హై అలర్ట్ ప్రకటించబడినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని ఈ వీడియోల్లో స్పష్టంగా చూడవచ్చు. పలు భవనాలు కుప్పకూలడంతోపాటు అనేక మంది శిథిలాల మధ్య చిక్కుకున్నారు. ప్రజలు కూడా అరుస్తూ పరుగులు తీయడం చూడవచ్చు.
BREAKING: First footage is emerging after a M7.8 earthquake in central Turkey.#Turkey #Earthquake
— Global News Network (@GlobalNews77) February 6, 2023
pic.twitter.com/5nJL41NFhO
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)