By: ABP Desam | Updated at : 23 Nov 2022 10:51 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: Twitter/@aysviola)
Turkey Earthquake: టర్కీలో భూకంపం సంభవించింది. పశ్చిమ టర్కీలో డ్యూజ్ పట్టణానికి సమీపంలో 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో 22 మంది గాయపడ్డారు.
ఇదీ జరిగింది
టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌కు తూర్పున దాదాపు 210 కి.మీ దూరంలో డ్యూజ్ పట్టణం ఉంది. అయితే భూకంపం కారణంగా ప్రాణనష్టం గురించి ఎటువంటి అప్‌డేట్ లేదని టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు.
ఈ ప్రకంపనలు ఇస్తాంబుల్, దేశ రాజధాని అంకారాలో సంభవించాయని స్థానిక మీడియా తెలిపింది. భూకంపం లోతు 2 కిమీ నుంచి 10 కిమీ వరకు ఉండచ్చని అధికారులు అంచనా వేశారు.
వాస్తవానికి ఈ ప్రకంపనలు వచ్చిన 20 నిమిషాల తర్వాత 4.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు రావడంతో కొంతమంది భవనాల బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. దీంతో కనీసం 22 మంది గాయపడ్డారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు. భూకంప దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Footage of the moment 5,9 magnitude #quake hit Düzce in northern Turkey. Tremors also felt across Istanbul and Ankara. 18 aftershocks recorded. No casualties or major damage reported so far. In Nov 99 in a 7,2 quake that hit Düzce over 800 ppl were killed pic.twitter.com/PUkZxGjl9N
— Selin Girit (@selingirit) November 23, 2022
although earthquake drills had been carried out many times days before, people fled from their beds due to the magnitude of the earthquake...two hours have passed since the magnitude 6.0 earthquake, but aftershocks still continue #Turkey #Earthquake pic.twitter.com/5un93zAyNN
— Aysu🎄 (@aysviola) November 23, 2022
ఒకప్పుడు
1999లో డ్యూజ్‌లో 7.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 845 మంది మరణించారు. దీని తర్వాత పశ్చిమాన 100 కి.మీ దూరంలో ఉన్న ఇజ్మిత్ నగరంలో మరింత పెద్ద భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 17,000 మందికి పైగా మరణించారు. ఈ ప్రాంతంలోని భవనాలు దెబ్బతిన్నాయి.1999లో సంభవించిన ఈ భూకంపాల తర్వాత డ్యూజ్ పట్టణంలో 80 శాతం భవనాలు పునర్నిర్మించారు.
268 మంది బలి
ఇండోనేసియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు సుమారు 268 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 151 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. 1,083 మంది తీవ్ర గాయాల పాలైనట్లు చెప్పారు. వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి.
Also Read: Satyendar Jain Video: జైలు గదిలో విందు భోజనం, ఆప్ లీడర్ మరో వీడియో వైరల్
ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి
Sajjanar Comments: 'మహిళలు సామూహికంగా టూర్ కు వెళ్తామంటే బస్ ఫ్రీ ఉంటుందా.?' - ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమాధానం ఇదే
I.N.D.I.A Alliance Meeting: త్వరలోనే I.N.D.I.A కూటమి భేటీ, సీట్ షేరింగ్‌పై క్లారిటీ కోసమే!
American Telugu Association: తెలుగు రాష్ట్రాల్లో ఆటా ఆధ్వర్యంలో 20 రోజులు సేవా కార్యక్రమాలు
Bhatti Vikramarka: 'సంపదను సృష్టించి ప్రజలకు పంచుతాం' - 6 గ్యారెంటీలకు వారంటీ లేదన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పారన్న డిప్యూటీ సీఎం భట్టి
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి
/body>