అన్వేషించండి

Tirumala News: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్

Andhra News: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు సర్వ దర్శనానికి తితిదే అనుమతి నిరాకరించడంతో వారు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొంది.

Heavy Rush in Tirumala: తిరుమలలో (Tirumala) శ్రీవారి సర్వ దర్శనంపై గందరగోళం నెలకొంది. టికెట్లు లేకుండా సర్వ దర్శనానికి (Sarvadarshan) వచ్చిన భక్తులను తితిదే అధికారులు క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. దీంతో భక్తులు (Devotees) ఏటీసీ కూడలి వద్ద గుంపులుగా బైఠాయించి, విజిలెన్స్ సిబ్బందితో (Vigjilence) వాగ్వాదానికి దిగారు. 31 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు దైవ దర్శనం కలిగించకుండా టీటీడీ చేస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు దొరకలేదని, శుక్రవారమైనా సర్వ దర్శనానికి అనుమతించాలని భక్తులు వేడుకుంటున్నారు. శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 2, నారాయణ గిరి షెడ్లు నిండి  నారాయణగిరి అతిథి గృహం వరకూ క్యూలైన్ చేరుకుంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి, టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతి నిరాకరించారు. రేపటి సర్వ దర్శనం టిెకెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూలైన్లలోకి పంపిస్తామని చెప్పారు. 

తొలుత అలా.. కానీ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం టోకెన్లు లేకపోయినా సర్వ దర్శనానికి అనుమతిస్తామని తితిదే అధికారులు తొలుత ప్రకటించారు. అయితే, భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో టోకెన్లు ఉన్న వారికే దర్శనానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు, శ్రీవారి వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్లను తితిదే పంపిణీ చేయడం మొదలుపెట్టింది. భక్తుల రద్దీ దృష్ట్యా నిర్దేశించిన సమయం కంటే ముందుగానే రాత్రి నుంచే టోకెన్ల పంపిణీ ప్రారంభించింది. వైకుంఠ ద్వార ప్రవేశాల కోసం తిరుపతిలో 9 కేంద్రాలను టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించగా, క్యూ కౌంటర్ల వద్ద భక్తులను అదుపు చేయడం సిబ్బంది వల్ల కాలేదు. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జారీ చేయడం ప్రారంభించారు. ప్రత్యేక రంగుల్లో ముద్రించిన టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు.

వీఐపీల తాకిడి

తిరుమలలో ఈ నెల 23 (శనివారం) నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు 80 వేల మంది శ్రీవారి దర్శించుకునేలా తితిదే అధికారులు ఏర్పాట్లు చేశారు. 10 రోజుల పాటు 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్ లైన్ ద్వారా విడుదల చేసిన టీటీడీ మరో 4.20 లక్షల సర్వ దర్శన టికెట్లను తిరుపతిలో జారీ చేయనుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు తాకిడ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే ఏపీ మంత్రులు, ముఖ్య అధికారులు తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం రాత్రికి అసెంబ్లీ స్పీకర్, ఇతర ప్రముఖులు తిరుమలకు రానున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఏడుగురు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు తిరుమలకు వస్తున్నట్లు సమాచారం. అటు, టీటీడీ పాలక మండలి సభ్యులు ఐదుగురు తిరుమలలోనే మకాం వేశారు.  వారే కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైకుంఠనాథుని దర్శనం కోసం క్యూ కడుతున్నారు. వీఐపీలు అధిక సంఖ్యలో వస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారికి వసతి, దర్శన సౌకర్యాల కల్పించే విషయంలో తితిదేపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: YSRCP Politics: అంతుచిక్కని బాలినేని అంతరంగం, మాజీ మంత్రి వ్యవహారశైలి పార్టీకి తలనొప్పిగా మారుతోందా?

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget