News
News
వీడియోలు ఆటలు
X

TTD News: రద్దీ లేని టైంలో తిరుమల వెళ్లాలనుకునే వారికి ఇదే ఛాన్స్‌- నిమిషాల్లోనే స్వామి వారి దర్శనం 

TTD News: తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సు వేచి ఉండే పని లేకుండా నేరుగా దర్శనాని పంపిస్తున్నారు. దీంతో నిమిషాల్లోనే స్వామి వారి దర్శనం భాగ్య కల్గుతోంది. 

FOLLOW US: 
Share:

TTD News: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ తగ్గింది. ప్రతి మంగళవారం స్వామి వారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం రోజున 65 వేల 904 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 29,209 మంది తలనీలాలు సమర్పించగా, 3.57 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉండడంతో నేరుగా శ్రీనివాసుడి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. 

బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నైవేద్యంగా..

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాస మూర్తి వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

అష్టదళపాద పద్మారాధన..

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వీఐపీ భక్తులకు  స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మారాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవ విశేషం. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయం వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు జరిపుతారు. సాయంకాలం సహస్ర దీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.

Published at : 09 May 2023 09:27 AM (IST) Tags: AP News Tirumala Rush Tirumala Hundi Income Tirumala News TTD Latest News

సంబంధిత కథనాలు

UPI: ఫోన్‌ తియ్‌-పే చెయ్‌, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్‌

UPI: ఫోన్‌ తియ్‌-పే చెయ్‌, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్‌

Karnataka Cabinet: కర్ణాటకలో ఇకపై ఉచిత విద్యుత్, అప్పటి నుంచే అమలు - మిగతా హామీలకూ గ్రీన్ సిగ్నల్

Karnataka Cabinet: కర్ణాటకలో ఇకపై ఉచిత విద్యుత్, అప్పటి నుంచే అమలు - మిగతా హామీలకూ గ్రీన్ సిగ్నల్

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Education Loan: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

Education Loan: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

టాప్ స్టోరీస్

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత

Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!