(Source: ECI/ABP News/ABP Majha)
Toyato Auto Plants: మూతపడిన 14 టయోటా తయారీ కేంద్రాలు - నిలిచిపోయిన కార్ల ఉత్పత్తి
Toyato Auto Plants: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా జపాన్ లోని తమ 14 తయారీ కేంద్రాలను మంగళవారం మూసి వేయడంతో కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది.
Toyato Auto Plants: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా జపాన్ లోని తమ 14 తయారీ కేంద్రాలను మూసివేసింది. దీంతో మంగళవారం రోజు నుంచి కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది. విడి భాగాల ఆర్డర్లను పర్యవేక్షించే కంప్యూటర్ వ్యవస్థలో లోపం తలెత్తడం వల్ల తయారీ కేంద్రాలను మూసివేసినట్లు సంస్థ ప్రకటించింది. ప్రాథమిక పరిశీలన తర్వాత ఇది సైబర్ దాడి కాకపోవచ్చని సంస్థ ఓ అంచనాకు వచ్చింది. అయితే ఈ సాంకేతిక లోపానికి కారణం ఏంటనే దానిపై ప్రస్తుతం విచారణ చేస్తున్నామని వివరించారు. తయారీ కార్యకలాపాలను తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని మాత్రం టయోటా స్పష్టంగా వెల్లడించలేదు. ఏయే మోడల్ కార్ల తయారీ నిలిచిపోయిందో చెప్పడానికి నిరాకరించింది. ఆసియాలో పలు దేశాల్లోని టయోటా తయారీ కేంద్రాల్లో ఇప్పటికే ఉత్పత్తి నెమ్మదిగా సాగుతోంది.
కరోనా ఆంక్షలు, సమీకండక్టర్ల కొరతతో తయారీ నెమ్మదించింది. గతంలోనూ ఓసారి టయోటా ఇదే తరహాలో తయారీని నిలిపివేసింది. ఇప్పుడు దాదాపు 13 వేల కార్లను తయారు చేయగలిగే సమయాన్ని నష్టపోయినట్లు కంపెనీ అప్పట్లో ప్రకటించింది. విడిభాగాలు సరఫరా చేసే ఓ కంపెనీ అప్పట్లో ప్రకటించింది. విడిభాగాలు సరఫరా చేసే ఓ కంపెనీ అంతర్గత సాప్ట్ వేర్ పై సైబర్ దాడి జరగడమే అప్పటి మూసివేతకు కారణం అని తెలుస్తోంది. మరోవైపు ఈరోజు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పూర్తిస్థాయి ఇథనాల్ ఇంధన అధారిత టయోటా ఇన్నోవా కారును ఆవిష్కరించనున్నారు.