అన్వేషించండి

Top Headlines Today: ఏపీ వ్యాప్తంగా సీఎం జగన్ బస్సు యాత్ర- కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై ప్రధాని మోదీ విమర్శలు

AP Telangana Latest News 18 March 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Telugu News Today: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా - అదే కారణమా?
తెలంగాణ గవర్నర్ తమిళిసై (Tamilisai) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపారు. అలాగే, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తమిళిసై తమిళనాడు నుంచి పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నుంచి తమిళిసై లోక్ సభకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం తమిళిసై చెన్నైకి వెళ్తారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, 2019 సెప్టెంబర్ 8న తమిళిసై తెలంగాణ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్ర - సీఎం జగన్ కీలక నిర్ణయం, ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం వరకూ ప్రచారం
దేశంతో పాటు రాష్ట్రంలోనూ ఎన్నికల సందడి మొదలైంది. ఏపీలో నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మేమంతా సిద్ధం' (Memantha Siddam) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 26న లేదా 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం కానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండిఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

'బీఆర్ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది' - జగిత్యాల సభలో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ ఆడుకుందని ప్రధాని మోదీ (PM Modi) మండిపడ్డారు. సోమవారం జగిత్యాలలో (Jagitial) జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీకి మద్దతు పెరిగిందన్న మోదీ.. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ - తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) సుప్రీంకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి.. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను చేర్చారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

కడప గడ్డపై మరోసారి వైఎస్‌ ఫ్యామిలీ ఢీ- ఈసారి ప్రధాన అజెండా ఏంటీ?
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలు కొన్ని తరాలు చెప్పుకునే స్థాయిలో జరగబోతున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని భవిష్యత్‌లో చూస్తామో లేదో అన్న సీన్స్‌ ఈసారి కనిపిస్తున్నాయి. ఏకంగా అన్నపై ఇన్ని రోజులు విమర్శలు చేస్తూ వచ్చిన షర్మిల ఆయన్నే ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇది నేరుగా అన్న జగన్‌పై పోటీ కాకపోయినా ఆయన నమ్మిన బంటుగా ఉన్న అవినాష్‌ను ఢీ కొడుతున్నారు. అంటే అన్నను ఢీ కొడుతున్నట్టే.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget