Top 5 Headlines Today: బీజేపీలో ఉండలేమంటున్న నేతలు, మరికొంత సమయం కావాలంటున్న వైసీపీ
Top 5 Telugu Headlines Today 30th May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
మరింత సమయం కావాలి
ఎన్నికలు వస్తున్న వేళ గుంటనక్కలు ఏకమవుతున్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి. తెలుగు దేశం, జనసేన పార్టీని ఉద్దేశించిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఆర్కెస్ట్రా పెట్టుకొని పగటి వేషగాడిలా, పిట్టలదొరలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు మరో మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. అప్పటి వరకు అంతా కలసిపని చేయాలని సజ్జల పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టికెట్ ఇస్తే వచ్చేస్తాం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముందు ముందు చేరికల జోష్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరుతామని టిక్కెట్లు కేటాయించాలని ఇద్దరు మాజీ ఎంపీలు ఆ పార్టీని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జన్ ఖర్గే దగ్గర ఉందని..ఆయన ఆమోద ముద్ర వేస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అంటున్నారు. నిజానికి ఆ ఇద్దరు ఎంపీలు స్వతహాగా బీజేపీ నేతలు కారు. పార్టీలు మారి బీజేపీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ గట్టిగా టార్గెట్ చేస్తుందని..గెలిచే పార్టీ అనే నమ్మకంతో చేరారు. ఇప్పుడా నమ్మకం చెదిరిపోవడంతో వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆ పని చేస్తే చంద్రబాబు ఫినిష్: తమ్మినేని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపైన చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమదాలవలసలో బైక్ ర్యాలీ నిర్వహించారు వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. ముందు దివంగత నేత మాజ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి శాసన సభాపతి తమ్మినేని సీతారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ.. సీఎం జగన్ మేనిఫెస్టోను దైవంగా భావిస్తారని వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికే 98.7 శాతం అమలు చేశారని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మెగా భేటీ
మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ మెగస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. తన కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. సతీమణి ఊర్మిళతో కలిసి, హైదరాబాద్‌లోని మెగాస్టార్ ఇంటికి వెళ్ళి ఆహ్వానించారు. చిరంజీవి దంపతులను కలిసి తమ కుమార్తె వివాహానికి రావాలని కోరాారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైల్డ్ థాట్
కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపారులు, సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎలాగోలా తమ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలని కోరుకుంటారు. అందులో తప్పేం లేదు. కానీ నిబంధనలు ఉల్లఘించి చేసే ఏ పనైనా శిక్షార్హమే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జోరా నైట్ క్లబ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ ఈవెంట్ జరిపింది. జంగిల్ పార్టీ పేరుతో జరిపిన ఈ ఈవెంట్ లో ఆ యాజమాన్యం చేసిన పనే ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహాన్ని, పోలీసు కేసులను ఎదుర్కొంటోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి