Top Headlines Today: ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ చర్చించిన అంశాలివే- తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh News Today | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ప్రధాని మోదీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఇటు తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సీరియస్ అయింది.
Telangana News Today on 27 November 2024 | ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ అక్కడే కలిసి దాదాపు అరగంట పాటు మాట్లాడారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మొన్న ఢిల్లీ వెళ్లి పవన్ కళ్యాణ్... మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. బుధవారం నాడు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర, దేశ రాజకీయాలపై కొంత సమయం చర్చించినట్టు తెలుస్తోంది. ఏపీకి కేంద్రం చేస్తున్న సాయానికి ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేపట్టాల్సిన ప్రాజెక్టులపై కూడా చర్చించినట్టు సమాచారం. పూర్తి వివరాలు
ఇథనాల్ పరిశ్రమ వివాదంలో బిగ్ అప్‌డేట్- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమ వివాదంలో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తూ స్థానికులు కొన్నిరోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ప్రజా స్పందన చూసి పునరాలోచనలో ప్రభుత్వం పడ్డట్టు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని ఆదేశించారు. అక్కడ పనులు స్థితి, ప్రజల అభిప్రాయాలు ఇతర అంశాలతో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందో చూడాలి. పూర్తి వివరాలు
నాకు భయమా! పోలీసుల నోటీసులపై డైరెక్టర్ ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) రాత్రి ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను భయపడి పారిలేదని సినిమా షూటింగ్ విషయంలో తిరుగుతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తనపై రిజిస్టర్ అయిన కేసులో విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు
ఏపీ మెగా డీఎస్సీ 2024 సిలబస్ విడుదల - అభ్యర్థులు చదువుకోవల్సిన అంశాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న మెగా డీఎస్సీ (AP Mega DSC 2024)కి సంబంధించి సిలబస్‌ను ప్రభుత్వ విడుదల చేసింది. ఏడు విభాగాలకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులు ఫాలో కావాల్సిన సిలబస్‌ను బుక్‌లెట్ రూపంలో తీసుకొచ్చింది. మూడో తరగతి నుంచి ఇంటర్ మీడియెట్ వరకు ఫాలో కావాలని సూచించింది. ఎస్జీటీ అభ్యర్థులు చదువుకోవల్సిన అంశాలు ఇవే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదని ఆక్షేపణ
తెలంగాణ (Telangana)లో సంచలనంగా మారిన నారాయణపేట జిల్లా మాగనూర్‌లో వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజినింగ్ అవ్వడంపై హైకోర్టు (Telangana High Court) సీరియస్ అయ్యింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా ప్రశ్నించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయ్యింది. పూర్తి వివరాలు