Top Headlines Today: ఏపీ రాజకీయాల్లో వింత పరిస్థితి; కరీంనగర్‌లో అన్ని పార్టీల నోట జైశ్రీరామ్ నినాదం - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింత పరిస్థితి
ఎన్నికలు అంటేనే పార్టీలకు లీడర్లకు చాలా ప్రతిష్టాత్మకం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల అంతకు మించి అన్నట్టు ఉన్నాయి. ఒకప్పుడు తమ సామర్థ్యాన్ని పనితీరును చెప్పుకుంటూనే ప్రత్యర్థుల పనితనంపై విమర్శలు చేసుకునేవి పార్టీలు. ఇప్పుడు ఎలక్షనీరింగ్ మారింది. తమ సత్తా చాటుకునేందుకు ఎందాకైనా అన్నట్టు మారిపోయింది రాజకీయం. ప్రత్యర్థులకు సంబంధించిన ఏ చిన్న తప్పిదాన్నైనా బూతద్దంలో పెట్టి ప్రజల ముందు ఉంచుతున్నారు. దీనికి ఆయా నాయకులు కుటుంబాలు కూడా వంత పాడుతున్నాయి. సమయం చిక్కిందని రక్తసంబంధీకులపైనే తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా చదవండి
గాజు గ్లాస్ గుర్తుపై జనసేనకు దక్కని ఊరట
స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన హైకోర్టును (Ap Highcourt) ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. జనసేన (Janasena) పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు, అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని ఈసీ స్పష్టం చేసింది. 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని తెలిపింది. ఇంకా చదవండి
'సీఎం జగన్ గారూ వీటికి సమాధానం చెప్పండి' - వైఎస్ షర్మిల
సీఎం జగన్ (CM Jagan)కు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న 'నవ సందేహాలు'కు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంకా చదవండి
కరీంనగర్‌లో అన్ని పార్టీల నోట జై శ్రీరామ్ నినాదం
ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు కామనే. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో విమర్శలతోపాటు రామ నామం వినిపిస్తోంది. రాముడు మీవాడే కాదు మావాడు కూడా అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎన్నికలవేళ ఇది హాట్‌టాపిక్‌గా మారుతోంది. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓ కొత్త నినాదం వినిపిస్తోంది. గెలుపు కోసం రాజకీయ వ్యూహాలు రచిస్తున్న రాజకీయ పార్టీలు రామనామ స్మరణ చేస్తున్నాయి. రాముడి పేరు వాడుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇంకా చదవండి
ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రాజకీయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం ఇప్పుడు ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేస్తోంది. అదే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం భూమి ఎవరిదని అధికారులు నిర్ణయిస్తారో వారికే సంపూర్ణ హక్కులు. మూడు దశల పోరాటం వరకూ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేదు. ఇప్పుడీ చట్టంలో ఉన్న అంశాలు పెను వివాదానికి కారణం అవుతున్నాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చేసింది కానీ.. అమలు చేయడం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ చట్టం ప్రకారం చేస్తున్న సర్వేలు .. రిజిస్ట్రేషన్లు అన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న ఆరోపణలు వస్తూండటం.. ఆన్ లైన్‌లో పేర్లు మారిపోయిన ఆస్తుల ఘటనలు ఎక్కువగా ఉండంతో ప్రజల్లో భయానక పరిస్థితి పెరుగుతోంది. ఇంకా చదవండి