Top 10 Headlines Today: బీజేపీకి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు, తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్ కనిపిస్తోంది.
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
Top 10 Headlines Today:
బీజేపీకి జగన్ బంపర్ ఆఫర్
మోదీ విధానాల పట్ల సంపూర్ణ సానుకూలతతో ఉన్నాం ఎన్డీఏలో టీడీపీ చేరికను కాలమే నిర్ణయిస్తుందని చంద్రబాబునాయుడు ఓ ఇంగ్లిష్ మీడియా చానల్‌తో చేసిన వ్యాఖ్యల తర్వతా వచ్చే ఎన్నికల్లో 2014 కూటమి రిపీటవుతుందన్న చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సందర్భంగా బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకుని కలసి పోటీ చేస్తామని.. ఒప్పిస్తామని ప్రకటించారు. ఎన్డీఏలో నమ్మకమైన మిత్రుల కోసం చూస్తున్న బీజేపీ కూడా టీడీపీ విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ రెడ్డి.. ఎన్డీఏలో టీడీపీ చేరకుండా .. చేర్చుకోకుండా బీజేపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హస్తంలో జోష్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరికల అంశం ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్ పెరిగే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పెరుగుతోందని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులు కూడా అధికార బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతారని టాక్ వినిపిస్తోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఫస్ట్ డే ఫస్ట్ షో
సినిమా తీసే ప్రొడ్యూసర్‌కు, వీక్షించే ప్రేక్షకుడికి ఇరువురుకీ లాభం కలిగే విధంగా వినూత్న విధానానికి ఏపీ ఫైబర్ నెట్ శ్రీకారంచుట్టబోతోంది. ఇకపై ఇంట్లోనే కొత్త సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనే పద్ధతిలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి. 2 జూన్, 2023న విశాఖపట్నంలోని పార్క్ హోటల్‌లో లాంఛనంగా ప్రారంభించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదే విధంగా హీరో సాయి రోనార్క్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు సి.కళ్యాణ్, రమా సత్యనారాయణ హాజరుకానున్నారన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వర్ష సూచన
నిన్న దక్షిణ ఛత్తీస్ గఢ్ & పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం, దక్షిణ తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న మరొక ఆవర్తనం ఈరోజు బలహీన పడ్డాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (మే 30) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుండి మరత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మి ఎత్తు వద్ద కొనసాగుతుందని వివరించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత మార్చి - ఏప్రిల్ మధ్య కాలంలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ తుది రాత పరీక్షల్లో 84.06 శాతం మంది అర్హత సాధించారు. ఫలితాలతోపాటు తుది రాత పరీక్ష ఫైనల్ 'కీ' ని కూడా అందుబాటులోకి వచ్చింది. తుది పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను మే 30న సాయంత్రమే ప్రకటించిన పోలీసు నియామక మండలి కొద్ది గంటల్లోనే ఫైనల్ కీని కూడా విడుదల చేసింది. తుది రాత పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ మొబైల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి చూసుకోవచ్చు.మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడి
హైదరాబాద్‌లో వీధి కుక్కల సమస్య ఇంకా తీరలేదు. బాలుడిపై కుక్క దాడి చేసిన ఘటన తాజాగా మరొకటి జరిగింది. గతంలో ఎన్నో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ తాజాగా మళ్లీ అలాంటి సమస్యే ఎదురు కావడం పట్ల నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో సంతోశ్ నగర్ కాలనీలో కుక్క దాడిలో ఓ బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. వీధి కుక్కల దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బండి సంజయ్ ఆరోపణలు
‘‘హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం, అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత మీదే. ఇప్పటికే ఓఆర్ఆర్ పై ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తుంది. ఇది ఏటా ఐదు శాతం పెంచుకుంటూ పోయినా 30 ఏళ్లకు ప్రభుత్వానికి 30 వేల కోట్ల ఆదాయం చేకూరేది. ప్రభుత్వం ఈ ఆలోచన చేయకపోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండీ కొట్టి మరీ టెండర్ ఇవ్వడం వెనుక జరిగితన తతంగం ఏమిటి? అసలు ప్రభుత్వం ఈ విషయంలో ఇంత గోప్యత ఎందుకు పాటిస్తోంది?. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రూ.14 వేల కోట్ల విలువైన నోట్లు జమ
2000 రూపాయల నోట్లను చలామణీ నుంచి వెనక్కు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ నెల 23 నుంచి పింక్ కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, మార్చుకోవడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లి పెద్ద నోట్లను చిన్న నోట్లలోకి మార్చుకుంటున్నారు లేదా తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రెజ్లర్ అల్టిమేటం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు తమ పతకాలను గంగానదిలో పారవేయడానికి వెళ్లగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రైతు ఉద్యమ నేత నరేష్ టికాయత్ రెజ్లర్ల అంశంపై జోక్యం చేసుకున్నారు. హరిద్వార్ కు వెళ్లి గంగా నదిలో తమ పతకాలను పారవేస్తున్న రెజ్లర్లను నరేష్ టికాయత్ నిలువరించారు. వారి సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషిద్దామని, ప్రస్తుతానికి పతకాలను గంగా నదిలో పారవేయవద్దని కోరారు. గంగలో పారవేసేందుకు రెజ్లర్ల చేతిలో ఉన్న పతకాల మూటను రైతు ఉద్యమ నేత టికాయత్ తీసుకున్నారు. ఐదు రోజుల గడువు ఇవ్వాలని, రెజ్లర్ల సమస్యకు పరిష్కారం వెతుకుదామన్నారు. ఓవైపు కన్నీటి పర్యంతమవుతూనే మరోవైపు ఆయనపై గౌరవంతో నరేష్ టికాయత్ మాటకు కట్టుబడి హరిద్వార్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు రెజ్లర్లు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడం విధి లిఖితం
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడం విధి లిఖితమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. మంచోళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుందని పేర్కొన్నాడు. ఒకవేళ ఓడిపోవాల్సి వస్తే అది ఎంఎస్ ధోనీ (MS Dhoni) చేతుల్లో అయితే తనకు ఆనందంగా ఉంటుందని వెల్లడించాడు. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి