News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Telangana Politics : తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల సునామీ ఖాయమేనా ? కారులో పట్టని నేతలంతా హస్తం వైపు మళ్లుతారా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల సునామీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ రెండో వారం నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

FOLLOW US: 
Share:

Telangana Politics :     తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.  జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరికల అంశం ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది.  వీరి చేరికతో కాంగ్రెస్‌ పార్టీకి మరింత జోష్‌ పెరిగే అవకాశం ఉందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలలో కాంగ్రెస్‌ పార్టీకి మరింత బలం పెరుగుతోందని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులు కూడా అధికార బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతారని టాక్‌ వినిపిస్తోంది.  

కాంగ్రెస్ కు దూరంగా ఉన్న నేతలు కూడా యాక్టివ్  

మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కూడా గతంలో కాంగ్రెస్‌ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకునేందుకు సిద్ధమయినట్లుగా చెబుతున్నారు.  టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసినప్పుడు.. పార్టీ విజయం కోసం గట్టిగానే పని చేశారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డితో విభేదాలు రావడంతో కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఇప్పటీ వరకు ఏ రాజకీయ పార్టీలో చేరలేదు.  ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీనే బెటర్‌ అని, తిరిగి సొంత గూటికి వచ్చి వచ్చే ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇతర పార్టీల్లో చేరనందున ఆయనను రేవంత్ కూడా వ్యతిరేకించరని అంటున్నారు. 

కాంగ్రెస్ నుంచి వెళ్లిన వాళ్లు మళ్లీ వెనక్కి !

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది.  ఇటీవలనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ మాజీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా  మళ్లీ కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వస్తున్నారు.  కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఇద్దరు మాజీ ఎంపీలు కూడా కాంగ్రెస్‌ పెద్దలతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారికి టికెట్ల కేటాయింపు విషయంలో స్పష్టత ఇస్తే తిరిగి సొంత గూటికి రావడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక కీలక నేత పేర్కొన్నారు.

బీఆర్ఎస్ టిక్కెట్ దక్కని నేతల చాయిస్ కాంగ్రెస్సే

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ త్వరలోనే..  టిక్కెట్లు ఖరారు చేయబోతున్నారు. సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు ఇస్తే చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది.  మఖ్యంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మరింత ఎక్కువగా ఈ సమస్య ఉంది. బలమైన నేతలు మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి సహా చాలా మంది నేతల పేర్లు ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. వీరందరితో ..  కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా టచ్ లో ఉంటున్నారని చెబుతున్నారు. 

చేరికల కోసం రేవంత్ తీవ్ర ప్రయత్నాలు 
  
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పార్టీని వీడిన నేతలు.. సొంత గూటికి రావాలని ఆప్పీల్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, ఈ విషయంలో అవసరమైతే పది మెట్లు దిగేందుకు తాను సిద్ధమని, క్షణికావేశంలో పార్టీని వీడిన ప్రతి నాయకుడు.. తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని ఆయన ఆహ్వానించారు.   ఇప్పుడు వారు తిరిగి సొంత గూటికి వస్తే పార్టీకి మరింత లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. తాను పది మెట్లు దిగుతానని రేవంత్ చెబుతూండటంతో.. పార్టీలో చేరాలనుకునేవారికి ఎలాంటి సమస్యలు రావని అంటున్నారు. 

Published at : 31 May 2023 06:34 AM (IST) Tags: Revanth Reddy Telangana Politics Congress Party Joining Congress

ఇవి కూడా చూడండి

Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు

Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు

BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!

BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!

Vizag Capital : విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?

Vizag Capital :  విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?

AP Early Polls : చంద్రబాబు జైలులో - మారిన మూడ్ - ఏపీలో ముందుస్తుకు రెడీ !

AP Early Polls :   చంద్రబాబు జైలులో - మారిన మూడ్ - ఏపీలో ముందుస్తుకు రెడీ !

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు, అక్కడినుంచే స్టార్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు, అక్కడినుంచే స్టార్ట్

టాప్ స్టోరీస్

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!