Top 10 News Today:
ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక యాప్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు. తాజాగా యాప్‌ను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. యాప్‌లో తెలుగు వెర్షన్ కూడా ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు. వచ్చే వారం దీనిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిస్ట్రక్షన్, డైవర్షన్‌తోనే కాలం గడిపేస్తోందని ప్రజాసమస్యలను పరిష్కారం చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ విమర్శించారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఫ్యానల్ చర్చలో పాల్గొన్న ఆయన తర్వాత ఏబీపీతో ప్రత్యేకంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎఆస్పత్రుల్లో మందులు కూడా ఉండటం లేదని పేద ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వానికి ప్రజుల బుద్ది చెబుతారన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
స్కిల్ యూనివర్సిటీకి మేఘా భూరి విరాళం
స్కిల్ యూనివర్సిటీ దిశగా మరో ముందడుగు పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ముందుకు వచ్చింది. మొత్తం స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. వీటితో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను మేఘా సంస్థ స్వీకరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కన్నీరు పెట్టుకున్న షర్మిల
జగన్ కోసం ఎంతో త్యాగం చేస్తే అన్యాయం చేస్తారా అంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తనను బాధించిందంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. జగన్ కోసం 3200 కి. మీ మేర పాదయాత్ర చేశానన్నారు. కన్నతల్లిని, చెల్లిని కోర్టుకు లాగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అంటూ ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
‘నేను.. 1995 నాటి చంద్రబాబునే’
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు.. టీడీపీ క్యాడర్‌కు చాలా క్లియర్ కట్ మెసేజ్‌ఇచ్చారు. పార్టీలో మెరిట్ ఉన్న వాళ్లకే పదువులు ఇస్తున్నామన్నారు. ‘మళ్లీ మళ్లీ చెబుతున్నా.. నేను 2014 నాటి చంద్రబాబు సీఎంను కాదని, 1995 నాటి చంద్రబాబును’ అని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నామని కక్షలు తీర్చుకోనని.. కానీ తప్పులు చేస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీలో మోస్తరు వర్షాలు
దానా తుఫాను తన దిశను మార్చుకోవడంతో ఏపీపై అంతగా ప్రభావం చూపలేదు. అయితే దానా తుఫాను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల చిరు జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త
అయ్యప్ప భక్తులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. విమానంలో వెళ్లే భక్తులు స్కానింగ్ అనంతరం పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమానం క్యాబిన్‌లోనే ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ సదుపాయం శనివారం నుంచి జనవరి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి గొట్టిపాటి
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ రంగంలో గత ప్రభుత్వంలో చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి మండిపడ్డారు. గత ఐదేళ్లలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడుతోందని అన్నారు. గడిచిన ఐదేళ్లలో జగన్ చేసిన విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా పారదర్శకత ప్రదర్శించలేదని మంత్రి గొట్టిపాటి అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సైకోల వీరంగం.. మూగజీవాలపై కత్తిపోట్లు
గోనెగండ్లలో సైకోలు వీరంగం సృష్టించారు. రాత్రి సమయంలో గుర్తు తీయలేని వ్యక్తులు మూగజీవాలపై ఆవులు, ఎద్దులు, ఎంపగొడ్లుపై కత్తులతో తీవ్రంగా పొడిచి వెళ్లారు. కత్తిపొట్లకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో పెద్ద ఎత్తున మూగజీవాలు అర్ధనాదాలు పెట్టాయి. గమనించిన పశువుల యజమానులు, రైతులు గోనెగండ్ల పశువైద్యశాలలో చికిత్సకై తరలించారు. మొత్తం10 పశువులపై దాడి చేయడంతో రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భారత్ ఘోర ఓటమి
భారత్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 245 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్‌లో జైస్వాల్ (77) రాణించగా.. మిగతావారు భారీ స్కోర్లు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో చెలరేగిన మిచెల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ 2-0తో కైవసం చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..