Vizag to vijayawada air india express service | విశాఖపట్నం: ఏపీలో కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖపట్నం- విజయవాడ మధ్య రెండు విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ప్రారంభించింది. విశాఖపట్నంలోని విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) సర్వీసు విశాఖ ఎయిర్ పోర్టులో ఉదయం 9:35కు బయలుదేరి 10:35 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరకుంటుందని అధికారులు తెలిపారు. తిరిగి అదే విమానం రాత్రి 7:55 గంటలకు విజయవాడ గన్నవరం విమనాశ్రయంలో బయలుదేరి రాత్రి 9 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుతుంది. 


ఇండిగో విమానం విజయవాడలో రాత్రి 7:15 గంటలకు బయలుదేరి 8:20కి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుతుందని అధికారులు తెలిపారు. అదే ఇండిగో సర్వీసు తిరిగి విశాఖలో రాత్రి 8:45 గంటలకు బయలుదేరి విజయవాడకు 9:50కి చేరుతుంది. ఈ కొత్త విమాన సర్వీసులతో కలిపి విశాఖ- విజయవాడ మధ్య తిరిగే సర్వీసులు 3కు చేరాయి. గతంలో ఒక్క విమాన సర్వీసు మాత్రమే అందుబాటులో ఉండేది.


Also Read: Fake Bomb Threats: విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ - సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్