AP SSC Exams 2025 Fee Payment Schedule: ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షల ఫీజు (SSC Exam Fee) చెల్లింపు షెడ్యూలును ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అక్టోబరు 25న నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం విద్యార్థులు అక్టోబరు 28 నుంచి నవంబరు 11 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఆలస్య రుసుముతో  చెల్లించేలా అవకాశం కల్పించినట్లు ఆయన వెల్లడించారు.


విద్యార్థులు రూ.50 ఆలస్యరుసుముతో నవంబరు 12 నుంచి నవంబరు 18 వరకు, రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 19 నుంచి 25 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో  నవంబరు 26 నుంచి నవంబరు 30 వరకు ఫీజు చెల్లించవచ్చని ఆయన వెల్లడించారు. ఆన్‌లైన్‌లోనే పరీక్ష ఫీజు చెల్లించాలని, పాఠశాల లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులూ చెల్లించొచ్చని ఆయన సూచించారు.


పరీక్ష ఫీజుగా రెగ్యులర్ విద్యార్థులు రూ.125, సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.125, వృత్తి విద్యా విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలని దేవానంద రెడ్డి తెలిపారు. వయసు తక్కువగా ఉండి పరీక్షలకు హాజరయ్యేవారు రూ.300, మైగ్రేషన్ సర్టిఫికెట్ అవసరమయ్యే వారు రూ.80 చెల్లించాలని ఆయన సూచించారు.


గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 7 పేపర్లతోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, సెకండ్ లాంగ్వేజ్‌, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటితోపాటు వొకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. గతేడాది పదోతరగతి పరీక్షలకు 7 లక్షలకుపైగా విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6.30 లక్షలు ఉన్నారు. వీరితోపాటు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైనవారు లక్ష వరకు ఉంటారు. గతేడాది పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు నిర్వహించారు. ఫలితాలను మే 6న విడుదల చేశారు. పరీక్షల్లో మొత్తం 5,34,574 (86.69 %) విద్యార్థలు అర్హత సాధించారు.


పరీక్ష ఫీజు ఇలా (AP SSC Exam Fee Details)..


➦ రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.


➦ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు మూడు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. మూడు కంటే తక్కువ ఉన్నవారు రూ.110 పరీక్ష ఫీజు చెల్లించాలి.


➦ ఒక ఒకేషనల్ కోర్సులు చదివేవారు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.


➦ వయసు తక్కువగా ఉన్నవారు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


➦ మైగ్రేషన్ సర్టిఫికెట్ అవసరమయ్యే వారు రూ.80 చెల్లించాలని 


ఫీజు చెల్లింపు తేదీలు (AP SSC Exam Fee Dates)..


➦ ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 28.10.2024.


➦ ఫీజు చెల్లించడానికి చివరితేది: 11.11.2024.


➦ రూ.50 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లింపు తేదీలు: 12.11.2024 - 18.11.2024.


➦ రూ.200 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 19.11.2024 - 25.11.2024.


➦ రూ.500 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 26.11.2024 - 30.11.2024.


పదోతరగతి మాదిరిప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..


Website



  


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...