రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఒక క్లారిటీ ఇచ్చారు. బాక్సాఫీస్ బరిలో మన బాహుబలి సత్తా ఏమిటో ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి మొదలు పెడితేనే ముంబై వరకు మరోసారి 'కల్కి 2898 ఏడీ'తో చూపించిన ఆయన ఆ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...


కల్కి 2 చేయడానికి టైం ఉంది!
Nag Ashwin On Kalki 2898 AD Part 2: 'కల్కి' సినిమాలో ప్రేక్షకులు చూసింది కొంతే... ఆ ప్రపంచంలో ఇంకా చూడాల్సిన వింతలు, విశేషాలు వీక్షకులు అందరూ ఆశ్చర్యపోయే‌‌ కథ, కథనాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు? సీక్వెల్ ఎప్పుడు చేస్తారు? అని రెబల్ స్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే వాళ్లను కాస్త డిజప్పాయింట్ చేసే న్యూస్ ఇది. కాకపోతే మళ్లీ మళ్లీ అడగకుండా క్లారిటీ ఇచ్చేశారు నాగ్ అశ్విన్.


'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ చేయడానికి టైం ఉందని ఆయన స్పష్టత ఇచ్చారు. తమిళ హీరో శివ కార్తికేయన్, 'ఫిదా' నుంచి మొదలుపెడితే ఆ తర్వాత చేసిన సినిమాలతో తెలుగు అమ్మాయి అయిపోయిన సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'అమరన్'. దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.‌ ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దానికి నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ప్రేక్షకులు కల్కి సీక్వెల్ గురించి పదేపదే అడగ్గా... ''కల్కి 2'కి చాలా టైం ఉంది చేద్దాం'' అని చెప్పారు.


'కల్కి' సీక్వెల్ చేయడానికి అంత టైం ఎందుకు?
'కల్కి 2898 ఏడీ' సినిమా విడుదలకు ముందే సీక్వెల్ కోసం కొన్ని సన్నివేశాలను చిత్రీకరణ చేసి పక్కన పెట్టారు. ఆల్రెడీ కథ లాక్ చేశారు. స్క్రీన్ ప్లే పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు. బాక్సాఫీస్ బరిలో 1000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాకు సీక్వెల్ అంటే చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మరి, ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి సినిమా టీం ఎందుకు ట్రై చేయడం లేదు? ఆ సినిమా సీక్వెల్ చేయడానికి ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటున్నారు? అంటే... ప్రభాస్ ఇంతకు ముందు అంగీకరించిన సినిమాలు కొన్ని ఉండటమే.


Also Read: ప్రభాస్‌తో పాటు వీళ్లదీ బర్త్ డే... ఇద్దరు హీరోయిన్లు, ఆ నిర్మాత కూడా ఈ రోజే పుట్టారని తెలుసా?



'కల్కి' సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో హారర్ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్' చేయడానికి ప్రభాస్ అంగీకరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉంది. 'కల్కి' కంటే ముందు విడుదలై రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా 'సలార్'. ఆ సినిమా సీక్వెల్ కూడా ప్రభాస్ మొదలు పెట్టాల్సి ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మరొక ప్రేమకథ మొదలు పెట్టారు. హను మూవీ, 'రాజా సాబ్', 'సలార్ 2' సినిమాలు కాకుండా 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తీసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో పోలీస్ స్టోరీ 'స్పిరిట్' ఓకే చేశారు. ఆ సినిమా కూడా ప్రభాస్ కంప్లీట్ చేయాలి. ఆయన చేతిలో ఉన్న సినిమాలో పూర్తి చేయాల్సిన కమిట్మెంట్లు ఎక్కువ ఉండడం వల్ల కల్కి టు సెట్స్ మీదకు వెళ్లడం ఆలస్యం కానుంది.


Also Readప్రభాస్‌కు, మిగతా హీరోలకు డిఫరెన్స్ ఏంటి? బాక్సాఫీస్ బాహుబలి ఎందుకంత స్పెషల్??