Celebs Share Prabhas Birthday: ఇండియన్ బాక్స్ ఆఫీస్ బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుగు ప్రేక్షకుల్ని అడిగితే ఠక్కున చెబుతారు. అక్టోబర్ 23 అని! పాన్ ఇండియా, జపాన్, గ్లోబల్ ఆడియన్స్ ఆ విషయం చెబుతారు. అక్టోబర్ 23న జన్మించిన మిగతా సెలబ్రిటీలు ఎవరో తెలుసా?
యూవీ క్రియేషన్స్ సంస్థలో మరొకరు
ఇండస్ట్రీలో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? అంటే... యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మాతలు ప్రమోద్, వంశీ గుర్తుకు వస్తారు. ఆ సంస్థలో మరొక నిర్మాత ఉన్నారు. ఆయన పేరు విక్రమ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న 'విశ్వంభర'తో ఆయన పేరు తెరపై పడుతోంది. ఆయన పుట్టినరోజు కూడా అక్టోబర్ 23నే.
చాందిని చౌదరి బర్త్ డే కూడా!
తెలుగమ్మాయి, డిఫరెంట్ అండ్ కంటెంట్ బేస్డ్ సినిమాలతో పాటు కమర్షియల్ మూవీస్ కూడా చేసిన యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి. ఆ అమ్మాయి బర్త్ డే కూడా అక్టోబర్ 23నే. ప్రస్తుతం 'సంతాన ప్రాప్తిరస్తు'లో చాందిని చౌదరి నాయికగా నటిస్తున్నారు. ఆ సినిమా యూనిట్ ఆవిడ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.
Also Read: ప్రభాస్‌కు, మిగతా హీరోలకు డిఫరెన్స్ ఏంటి? బాక్సాఫీస్ బాహుబలి ఎందుకంత స్పెషల్??
నయన్ సారిక... ఈ అమ్మాయి తెలుసుగా!
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ జంటగా 'ఆయ్' సినిమాలో నటించిన అమ్మాయి గుర్తు ఉందా? దానికి ముందు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా వచ్చిన 'గం గం గణేశా'లో కూడా నటించింది. నిహారికా కొణిదెల నిర్మించిన వెబ్ సిరీస్ 'బెంచ్ లైఫ్'లో చరణ్ పెరి భార్యగా సందడి చేసింది. ఆ అమ్మాయి పుట్టిన రోజు కూడా ఈ రోజే. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన 'క'లో కూడా నయన్ సారిక నటించింది. ఆమెకు ఆ టీమ్ బర్త్ డే విషెస్ చెప్పింది.
యాంకర్ ప్రదీప్... దర్శకుడు కల్యాణ్ శంకర్!
'మ్యాడ్' సినిమాతో ప్రేక్షకుల్ని నవ్వించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' తెరకెక్కిస్తున్నారు. ఆయన బర్త్ డే కూడా ఇవాళే. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బర్త్ డే కూడా ఇవాళే. ఈ రోజు జన్మించిన మరొక సెలబ్రిటీ ప్రదీప్ మాచిరాజు. ఆయన ఎన్నో షోలకు యాంకరింగ్ చేశారు. బుల్లితెరపై ఆయనది స్టార్ ఇమేజ్. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో హీరోగానూ విజయం అందుకున్నారు. ఇప్పుడు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అంటూ హీరోగా మరో సినిమా చేస్తున్నారు.