టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమా "క" పాన్ ఇండియా రిలీజ్ కు బ్రేకులు పడ్డాయి. తాజాగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో స్వయంగా కిరణ్ అబ్బవరం ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఇప్పటిదాకా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా ఎందుకు ఒక్క తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుంది? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి. 


కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'క'. ఇందులో తన్వీ రామ్, నయని సారిక వంటి యంగ్ హీరోయిన్లు కిరణ్ అబ్బవరంతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారు. దర్శక ద్వయం సుజిత్, సందీప్ ఈ రూరల్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని ఈనెల 31న దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా నిర్ణయించుకున్నారు. కానీ తాజాగా ఈ విషయంలో అడ్డంకులు ఎదురైనట్టుగా తెలుస్తోంది. 


ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా మీడియాకు 'క' సినిమా ట్రైలర్ ను ప్రదర్శించారు మేకర్స్. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని వెల్లడించారు. మూవీ రిలీజ్ కి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఈనెల 31న కేవలం ఈ సినిమాను తెలుగు భాషలో మాత్రమే రిలీజ్ చేస్తున్నామంటూ షాక్ ఇచ్చారు. అయితే ఓ వారం తర్వాత ఈ సినిమాను మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. దీనికి ఒక ప్రత్యేకమైన కారణమే ఉంది. 



Read Also : Ka Trailer : పగటిపూట 3 గంటలకే చీకటి పడే వింత ఊరు... క్యూరియాసిటీని పెంచేస్తోన్న 'క' ట్రైలర్ 


మలయాళంలో ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తీసుకున్నారని వెల్లడించిన కిరణ్ అబ్బవరం అక్కడ ఈ వారం ఆయన నటించిన 'లక్కీ భాస్కర్' మూవీ రిలీజ్ అవుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. మలయాళంలో దుల్కర్ బిగ్ స్టార్ కాబట్టి ఆయన సినిమాకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ఇక తమిళంలో అసలు థియేటర్స్ దొరకలేదని, అందుకే ఈ మూవీని ఒక వారం తర్వాత మిగతా భాషల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. అంతేకాకుండా తెలుగులో సినిమాకు మంచి సక్సెస్ వస్తే ఇతర భాషల నుంచి ఆటోమేటిక్ గా రెస్పాన్స్ వస్తుందని అన్నారాయన. 


"క సినిమాలో గతంలో చూసిన ఏదైనా ఎలిమెంట్ స్క్రీన్ మీద చూసామని మీకు అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తాను" అంటూ ఛాలెంజ్ విసిరాడు కిరణ్ అబ్బవరం. ఇక ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. వాసుదేవ్ ఈ సినిమాలో అనేక షేడ్స్ లో కనిపిస్తాడని, గ్రే షేడ్స్ కూడా ఉంటాయనీ, క్లైమాక్స్ 20 నిమిషాలు హైలెట్ అవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా తన గత సినిమాల్లో కంటెంట్ పరంగా కొన్ని మిస్టేక్స్ జరిగాయని, ఈ సినిమాలో అలాంటి మిస్టేక్స్ ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డామని చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం కిరణ అబ్బవరం ఆశాలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నారు.



Read Also : SDT 18 Update : SDT 18 నుంచి సాలిడ్ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పేసిన మేకర్స్