సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న 18వ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో వెల్లడిస్తూ ఒక కొత్త వీడియోని రిలీజ్ చేశారు. మరి ఆ వీడియోలో ఏముందో? ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి
'బ్రో' మూవీ తర్వాత సాయి దుర్గా తేజ్ కొంచెం గ్యాప్ తీసుకుని SDT 18 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరించబోతున్న విషయం తెలిసిందే. 'హనుమాన్' లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. రోహిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా, మూవీ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల కాలంలో తన మ్యూజిక్ తో థియేటర్లలో ప్రేక్షకులను ఊపేస్తున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నట్టు అఫీషియల్ గా వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆయన విరూపాక్ష, మంగళవారం, మహారాజా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించారు. SDT 18తో పాటు 'భగీరా' వంటి పాన్ ఇండియా సినిమాలకు ఆయన సంగీతం అందిస్తున్నారు.
సాయి తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న అప్డేట్స్ అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజై టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వగా, అందులో తేజ్ ట్రాన్స్ఫార్మేషన్ మెగా అభిమానులను అబ్బురపరిచింది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్మెంట్ క్యూరియాసిటీని పెంచేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఏబీపీ దేశం సదరన్ సమ్మిట్ కి పాల్గొన్న సాయి తేజ్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. '300 యోధులు' అనే సినిమా ఆధారంగా ఈ స్టోరీ లైన్ రాసుకున్నారని, ఒక రకంగా చెప్పాలంటే '300 యోధులు' అనే మూవీ ఈ మూవీకి ఇన్స్పిరేషన్ అంటూ సాయి తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్ లో ఉన్నాయని, తెలుగు ఆడియన్స్ అందరూ ఈ సినిమాను మా సినిమా అని గర్వంగా చెప్పుకునేలా మూవీ ఉంటుందని చెప్పి మెగా ఫ్యాన్స్ లో జోష్ పెంచేశారు. ఇప్పటికే మూవీకి సంబంధించి 30% షూటింగ్ పూర్తయిందని ఏబిపి నిర్వహించిన 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024'లో చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు.