‘Spiderman 4’ Official Release Date: ‘స్పైడర్ మ్యాన్‘. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా, ఎంతో మందిని అద్భుతంగా అలరించిన సినిమా. ఈ ప్రాంఛైజీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాలను అందుకున్నాయి. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. తాజాగా ఈ సిరీస్ నుంచి మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘స్పైడర్ మ్యాన్ 4‘తో ఆడియెన్స్ ను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.


2026లో ‘స్పైడర్ మ్యాన్4‘ విడుదల


మార్కెల్ సినిమాటిక్ యూనివర్స్(MCU) టామ్ హాలండ్ నటించిన ‘స్పైడర్ మ్యాన్ 4‘ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఒకానొక సమయంలో ఈ సినిమాలో టామ్ హాలండ్ ఉంటారా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు అవన్నీ అవాస్తవాలేనని తేలిపోయింది. టామ్ హాలండ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని సోనీ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘స్పైడర్ మ్యాన్‘ సిరీస్‌ లోని నాల్గవ చిత్రం జూలై 24, 2026న థియేటర్లలో రాబోతున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ‘స్పైడర్ మ్యాన్‘ను వచ్చిన మూడు సినిమాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. నాలుగో మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని మేకర్స్ వెల్లడించారు. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్, జోన్ వాట్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 






జులై 24ను ఎందుకు ఫిక్స్ చేశారంటే?


‘స్పైడర్ మ్యాన్ 4‘ సినిమా హాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘Avengers: Doomsday‘ మే 1, 2026న విడుదల కానుంది. ‘Avengers: Secret Wars‘ 2027లో విడుదల కానుంది. ఈ రెండు సినిమాల నడుమ ‘స్పైడర్ మ్యాన్ 4‘ విడుదలకు రెడీ అవుతోంది. రెండు అవెంజర్స్ చిత్రాల మధ్య స్పైడర్ మ్యాన్ 4ని విడుదల చేయడం ద్వారా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని సోనీ పిక్చర్స్ భావిస్తోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కు ఈ డేట్ కలిసి వచ్చే అవకాశ ఉందని అంచనా వేస్తోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ఈ చిత్రాలు మంచి వినోదాన్ని కలిగించనున్నాయి. ముఖ్యంగా ‘స్పైడర్ మ్యాన్ 4‘ సినిమా కోసం పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూడాలా అనే ఉత్సాహంతో ఉన్నారు.  


Read Also: ఆ హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో - ‘SDT18’ గురించి అసలు విషయం చెప్పిన సాయి దుర్గ తేజ్!