Ammayi garu Serial Today Episode పింకీ జీవన్‌ని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు. ప్రమాణ స్వీకారానికి వస్తానని చెప్పి ఇలా పెళ్లి చేసుకొని వచ్చావేంటి అని పింకీని తన తండ్రి అడుగుతాడు. ఇక రూప పింకీ నీ కోసం బాబాయ్ పిన్నిలు ఎన్ని కలలు కన్నారో నీకు తెలీదా ఏ విషయం అయినా నాతో చెప్తావ్ కదా ఈ విషయం ఎందుకు దాచావ్ అని ప్రశ్నిస్తుంది. రూప, సుమ, మందారం ఏడుస్తారు.
సుమ: ఏయ్ ఈ ఇంటి పరువు తీసే పని చేసి మళ్లీ ఎందుకు ఇక్కడికి వచ్చావ్ మాకు ఓ బిడ్డ ఉంది అనే విషయమే మర్చిపోతాం పోవే ఇక్కడి నుంచి.
సూర్యప్రతాప్: రేయ్ జీవన్ నీకు నా మీద పగ ఉంటే నా మీద చూపించాలి ఏం చేశావ్‌రా నా బిడ్డని.
సుమ: వాడిని అడిగి ఏం ప్రయోజం బావగారు.
సూర్యప్రతాప్: చెప్పరా ఏం చేశావ్ నా బిడ్డని ఏం మాయమాటలు చెప్పావ్.
జీవన్: మాయమాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మామగారు.
రూప: పింకి వీడు ఎంత దుర్మార్గుడో తెలుసి కూడా ఇలా ఎలా పెళ్లి చేసుకున్నావ్
సూర్యప్రతాప్: సెక్యూరిటీ ఇక్కడ నుంచి వీడిని గెంటేయండి.
పింకీ: ఆగండి పెద్దనాన్న ఈ పెళ్లి నేను ఇష్టపూర్వకంగానే చేసుకున్నాను.
సూర్యప్రతాప్: సెక్యూరిటీ అయితే వీళ్లిద్దరినీ పంపేయండి.
పింకీ: పెద్ద నాన్న మేం ఏం తప్పు చేశాం అని గెంటేస్తారు ఇద్దరం మేజర్లం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం.
సుమ: ఒక్కటి కొట్టి ఏం మాట్లాడుతున్నావే పెద్దనాన్ననే ఎదురు తిరుగుతావా.
చంద్ర: నీకు ఏం కావాలి అంటే అది ఇచ్చాం గుండెల మీద పెట్టుకొని పెంచుకుంటే గుండెల మీద తన్నేశావ్.
రూప: పింకీ నువ్వు ఏదో దాస్తున్నావ్ నీ గురించి మా అందరికీ బాగా తెలుసు. కచ్చితంగా ఈ పని నీ ఇష్టప్రకారం జరగలేదని అర్థమవుతుంది.
పింకీ: ఎన్ని సార్లు చెప్పాలి అక్క. నన్ను నమ్ముతా అంటారు నేను చెప్పేది వినరు.
జీవన్: సీఎంగా గెలిచి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ అది కుదరలే అందుకు సీఎం అల్లుడిగా అయినా ప్రజాసేవ చేసుకోవాలి అనుకున్నా అయినా ఇంటి అల్లుడిని ఇలా గుమ్మం ముందు నిలుచోపెట్టి ఇలా మాట్లాడితే ఎలా.
చంద్ర: రేయ్ ఈ ఇంటి వంట మనిషిగా కూడా నువ్వు పనికి రావు ఇంటి అల్లుడివేంట్రా. నువ్వు బయటకి పోరా ఈ ఇంటి పరువు తీసుకుపోయినా ఈ దరిద్రాన్ని కూడా తీసుకెళ్లిపో.
జీవన్: ఏంటి మామయ్య నా పెళ్లాన్ని దరిద్రం అంటున్నారు సూర్యప్రతాప్ గారి కూతురు రూప కూడా ఇలాగే తాళి కట్టించుకొని వచ్చింది కదా. అప్పుడు కనీసం తాళి కట్టిన వాడు ఎవరో తెలియకపోయినా రూపని ఇంట్లోకి రానిచ్చారు.
సూర్యప్రతాప్: నువ్వు ఒక చీటర్‌వి దొంగవి ఇలాంటి వాడిని నా కూతురు నమ్మిందంటే నేను నమ్మను.
విజయాంబిక: తమ్ముడు ఇప్పుడే సీఎంగా ప్రమాణం స్వీకారం చేశావ్. ఇప్పుడు వీళ్లని గెంటేస్తే మీడియా మనల్ని తప్పు పడుతుంది. నువ్వు ఇప్పుడు రాష్ట్ర పెద్దగా ఆలోచించాలి.
సూర్యప్రతాప్: నాకు పొలిటికల్ కెరీర్ కంటే నా పిల్లల కెరీర్ ముఖ్యం.
విజయాంబిక పింకీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి అడిగితే పింకీ తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నానని అంటుంది. కోపంతో సూర్యప్రతాప్ వెళ్లిపోతే ఏడుస్తూ సుమ వెళ్లిపోతుంది. సుమ వెనక రూప వెళ్తుంది. ఇక చంద్ర కూడా వెళ్లిపోతాడు. ఇక దీపక్, విజయాంబిక అక్కడ ఉంటారు. విజయాంబిక హారతి పళ్లెం తీసుకొచ్చి ఇద్దరినీ లోపలికి ఆహ్వానిస్తుంది. ఇప్పుడే ఆట ఆరంభం అయిందని జీవన్ అనుకుంటాడు. జీవన్ రూప దగ్గరకు వెళ్లి నీ చెల్లి నన్ను పెళ్లి చేసుకోలేదు అని నేనే చేసుకున్నానని మీ అందరినీ ఆడుకోవడానికే ఈ పెళ్లి చేసుకున్నాను అని జీవన్ అంటాడు.
నా చెల్లి ప్రేమించిన వాడిని నువ్వు పెళ్లి చేసుకొని చెల్లిని అరెస్ట్ చేయించి నా జీవితాన్ని మా నాన్న రాజకీయం జీవితం నాశనానికి కారణం మీరే కదా అందుకే రివేంజ్ తీసుకోవాలి అనుకుంటున్నా అంటాడు. మీరు పాపాలు తప్పులు చేసి వాటికి మేం కారణం అనుకోవడం బుద్ధ తక్కువ అంటుంది. ఏదో తప్పుడు ఉద్దేశంతో ఈ పెళ్లి చేసుకున్నావని అది తెలుసుకొని నిన్ను బయటకు పంపుతానని అంటుంది రూప. దాంతో జీవన్ ఈలోపు నేను మీ నాన్నని పదవి నుంచి దించేస్తా అని రాజుని నిన్ను విడదీస్తానని అంటాడు. రూప, జీవన్‌లు ఒకరితో ఒకరు ఛాలెంజ్‌లు చేసుకుంటారు. తర్వాత రూప రాజుకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. రాజు షాకైపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్య మీద సంజయ్ కళ్లు, వంకర మాటలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి భర్తకి కంప్లైంట్ ఇచ్చిన సత్య!