Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్, దీప, శౌర్యలు కార్తీక్ గదిలోనే ఒకే బెడ్ మీద పడుకుంటారు. శౌర్య  కార్తీక్ చేతిని తీసుకొని ముద్దు పెడుతుంది. తర్వాత దీప చేయి పట్టుకొని ముద్దు పెట్టి నాన్న నేను ముత్యాలమ్మ తల్లికి తాతయ్యకి నాకు మంచి నాన్నని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. ఇద్దరినీ ముద్దు పెట్టుకొని నాకు చాలా హ్యాపీగా ఉందని అంటుంది. దీప ఇబ్బంది పడుతూనే ఉంటుంది. 


శౌర్య కార్తీక్, దీపలు చేతులు ఇద్దరివీ తీసుకొని దగ్గరగా పెడుతుంది. కార్తీక్ చేయి తాకగానే దీప చేయి వెనక్కి తీసుకుంటుంది. ఎందుకు చేయి తీసుకొని ఉన్నావమ్మా అని మళ్లీ ఇద్దరి చేతులు ఒక దగ్గరకు చేర్చుతుంది. ఇక శౌర్య కథ చెప్పమని కార్తీక్‌ని అడిగితే కార్తీక్ ప్రశాంతంగా ఉన్న పక్షి, తుఫాను అంటూ కథ చెప్తాడు. ఆ కథ దీప తన జీవితానికి అన్వయించుకొని జరిగిన కథ అంతా గుర్తు చేసుకుంటుంది. ఇది కథ కాదు నా జీవితం అని దీప అనుకుంటుంది. ఇక శౌర్య పడుకుండిపోతుంది. పాప పడుకోగానే దీప లేచి పాపకి దుప్పటి కప్పేసి వెళ్లిపోతుంది. దీప రావడం అనసూయ చూస్తుంది.


అనసూయ: నా మాట కాదనలేక కూతురి బలవంతంగా వెళ్లావు కానీ నువ్వు ఆ గదిలో ఉండలేవని నాకు తెలుసే. కార్తీక్ బాబుతో నీకు పెళ్లి అయింది అతను నీ భర్త ఇది నిజం ఒక భార్య భర్తతో ఎలా ఉండాలో అలా ఉండు. భగవంతుడు నీకు ఇచ్చిన ఈ బంధం నీ కూతురి కోసమే కాదు నీ కోసం కూడా. నీ కూతురి కోసమే అనుకుంటే అన్యాయం చేసిన దానివి అవుతావు. అలా అని కార్తీక్ బాబుకు ఆశలు ఉండవు అనుకుంటే పొరపాటే. మా అమ్మ నాన్నతో ఉన్నట్లే తన భార్య తనతో ఉండాలని ప్రతీ మగాడు అనుకుంటాడు. తాళి కట్టిన భర్తకే కాదు భర్త తల్లికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి. మీ అత్తయ్యకి కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. పెళ్లి అయిన తన కొడుకు కోడలితో సత్యన్నారాయణ వ్రతం చేయించుకోవాలి అనుకుంటుంది.
దీప: వద్దు అత్తయ్య నువ్వు ఎన్ని చెప్పినా నేను ఈ పెళ్లిని తీసుకోలేను. నా కూతురి కోసం నేను ఉంటాను అంటే ఆయన భార్య స్థానంలో నేను ఉండలేను. దీప గుడికి వెళ్లి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్త అమ్మ స్థానంలో ఉండి ఆలోచించి ఉంటే నాకు వ్రతం చేయమని చెప్పేవాళ్లే కాదు. కానీ దురదృష్టవంతురాలిని పుట్టగానే అమ్మని పోగొట్టుకున్నా. ఇప్పుడు అనిపిస్తుంది నాకు అమ్మ ఉండి ఉంటే బాగున్నని.
సుమిత్ర: గుడికి వచ్చి జ్యోత్స్న పేరు మీద అర్చన చేయించమని చెప్తుంది. జ్యోత్స్న బాధ చూడలేకపోతున్నానని దాని మనసు మార్చి జీవితం సరిదిద్దాలని కోరుకుంటుంది. పూజ తర్వాత పంతులు పండు ఇచ్చి మీ కూతురికి ఇవ్వండి అంతా మంచే జరుగుతుందని చెప్పి సుమిత్రకు ఇస్తారు. సుమిత్ర తీసుకొస్తుంటే అది కింద పడి దీప దగ్గరకు వెళ్తుంది. 
దీప: ఇదిగోండి అమ్మ దీని కోసమే వచ్చారా.
సుమిత్ర: పెళ్లి అయిన ఆడదానివి గుడికి ఒంటరిగా వచ్చావేంటి.
దీప: మీరు నన్ను చూడగానే ముఖం తిప్పుకొని వెళ్లిపోతారు అనుకున్నానమ్మ.
సుమిత్ర: తల రాతని ఎవరూ మార్చలేరు.
దీప: నేను కావాలని ఈ తప్పు చేశానని మీరు అనుకుంటున్నారు కదా.
సుమిత్ర: తప్పు జరగలేదు పెళ్లి జరిగింది. మీ ఇద్దరికీ భగవంతుడు రాసి పెట్టాడు. అందుకే నా కూతురి మెడలో పడాల్సిన తాళి నీ మెడలో పడింది. ఇప్పుడు నా బాధ అంతా జ్యోత్స్న గురించే అది కార్తీక్‌ని మర్చిపోదు. అలా అని ఇంకో పెళ్లి చేసుకోదు ఆ బాధ నుంచి బయట పడటానికి కొంత టైం పడుతుందని నాకు తెలుసు. కానీ తల్లి మనసు కదా చూస్తూ ఉండలేను. నువ్వు ఎలా ఉన్నావ్ బాధగా కనిపిస్తున్నావ్.
దీప: ఇష్టం లేని పెళ్లికి బాధ కాకపోతే ఏం ఉంటుంది. 
సుమిత్ర: కార్తీక్ ని నువ్వు భర్తగా ఒప్పుకోలేదా
దీప: మీరైనా నన్ను అర్థం చేసుకోండి అమ్మా నేను బతకుతున్నది శౌర్య కోసం. ఈ తాళి నా మెడలో పడింది  కూడా అదే శౌర్య కాదు. నా మెడలో తాళి కట్టి కార్తీక్ బాబు నా బిడ్డకు తండ్రి అంతే కానీ నా భర్త ఎలా అవుతారమ్మా.
సుమిత్ర: చూడు దీప తాళి ఎలా పడింది అన్నది అనవసరం కార్తీక్ నీ భర్త. పెళ్లి జరిగింది దీన్ని ఎవరూ మార్చలేరు. అలా అని నువ్వు చేసిన పని ఆనందంగా ఉందని నేను చెప్పలేను. అలా అని తిట్టలేను. ఒకప్పుడు నేనే అన్నాను నిన్ను నా కూతురు అని. నా మేనల్లుడికి నా కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనేది నా సంకల్పం దాన్ని నువ్వు మరో విధంగా పూర్తి చేశావు. పూజారి నా కూతురి కోసం ఇచ్చిన ఈ ప్రసాదం ఇప్పుడు జ్యోత్స్న కంటే నీకే ఎక్కువ అవసరంలా ఉంది తీసుకో అని దీప చేతిలో పండు పెట్టి వెళ్లిపోతుంది.
దీప: మీ మనసులో కూడా నా మీద కోపం ఉందని అర్థమవుతుందమ్మ ఇప్పుడు నేను కాంచన గారికి ఏం చెప్పాలి ఏం చెప్పి వ్రతం ఆపాలి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: రూప చెల్లి, రాజు తమ్ముడి లవ్‌ట్రాక్‌ని జీవన్‌ వాడుకుంటాడా.. పోలీస్‌ గెటప్‌తో గ్యాంగ్!