Seethe Ramudi Katnam Serial Today Episode ప్రీతీతో తన పెళ్లి జరిపించకపోతే ఎవరినీ వదలనని రాకేశ్ బెదిరించడంతో రామ్ రాకేశ్ కాలర్ పట్టుకొని ఏం చేస్తావ్ రా అని అడుగుతాడు. అలా అడగటం కాదు నాలుగు తగిలించు మామ అని సీత అంటుంది. రామ్ కొట్టబోతే మహాలక్ష్మీ ఆపుతుంది. వాళ్ల పాపాన వాళ్లే పోతారని అంటుంది. సీత వాళ్లని వెళ్లిపోమని మా ఇంటి వైపు మా వైపు చూస్తే మీ అంతు చూస్తా అంటుంది. దానికి రాకేశ్ తండ్రి మమల్ని అవమానిస్తారా మీ అంతు చూస్తా అంటాడు.
శివకృష్ణ వాళ్లతో నా ముందే బెదిరిస్తారా జైలులో పెడతా అంటాడు. ఇక రాకేశ్ ప్రీతికి ఎలా పెళ్లి అవుతుందో చూస్తానని అంటాడు. రామ్ ఆవేశంగా వెళ్లి ఏంట్రా నువ్వు అంతు చూసేది అని అంటాడు. రాకేశ్ వాళ్లు వెళ్లిపోతారు. ప్రీతి లైఫ్ సేవ్ చేసినందుకు అందరూ శివకృష్ణకు థ్యాంక్స్ చెప్తారు. ఇక ప్రీతి శివకృష్ణని హగ్ చేసుకొని కృతజ్ఞతలు చెప్తుంది.
మహాలక్ష్మీ: పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది ఇప్పుడు ప్రీతి పరిస్థితి ఏంటి.
శివకృష్ణ: నేనే సంబంధం తీసుకొస్తా నా మేనకోడలికి మా ఊరిలో మా ఇంట్లోనే పెళ్లి చూపులు. మీరందరూ అక్కడికి రండి. ఇక నేను బయల్దేరుతా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి అక్కడికి పిలుస్తా.
విద్యాదేవి: చాలా థ్యాంక్స్ అన్నయ్య సమయానికి వచ్చి నా కూతురి జీవితం కాపాడావు. సమయానికి సీత కూడా చేతులెత్తేసింది ఇంతలో నువ్వు వచ్చావు.
శివకృష్ణ: ఇదంతా చేయించింది సీతే చెల్లి నిన్ను ఫోన్ చేసి మొత్తం నాకు చెప్పింది. చివరి నిమిషంలో మ్యాజిక్ చేశావు.
విద్యాదేవి: అన్నయ్య నేను నా పెళ్లి విషయంలో నీ మాట వినలేదు నాకూతురి పెళ్లి బాధ్యత మాత్రం నీదే.
సీత: ఏంటి అన్నాచెల్లెల్లు మాట్లాడుతున్నారు. అలాగే ఫీలవుతారని అన్నాచెల్లెల్లు అన్నాను.
శివకృష్ణ: మేం నిజంగానే అన్నచెల్లెల్లమే సీత.
రామ్ సీతని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాడు. చెల్లిని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పి అందరూ అపార్థం చేసుకున్నందుకు సారీ అంటాడు. ఇక రామ్ సీతని ముద్దు పెట్టుకుంటాడు. ఉదయం అందరూ హాల్‌లో కూర్చొంటారు. రామ్ అకౌంట్స్ చూస్తాడు. టెండర్లన్నీ మనమే దక్కించుకోవాలని అర్చన అంటే ఏది పడితే అది తీసుకుంటే టర్నోవర్ పోతుందని అంటాడు. ఇంతలో రేవతి, కిరణ్ వచ్చి మా జీవితాల మీద దెబ్బ కొట్టి మీరు బాగానే సొమ్ము చేసుకుంటున్నారని అంటుంది రేవతి. ఏమైందని రామ్ అంటే మాకు రావాల్సిన టెండర్ మీరు దక్కించుకున్నారని చెప్తారు. మోసంతో టెండర్ దక్కించుకున్నారని అంటాడు కిరణ్. ఇదంతా ఎప్పుడు జరిగిందని రామ్ అంటే ఇంట్లో ఉన్నావ్ నీకు తెలీదా అంటాడు.
అర్చన: మమల్ని కాదని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన దానివి సిగ్గు లేకుండా మా ఇంటికి ఎందుకు వచ్చావ్.
రేవతి: ఆస్తిలో వాటా అడగటానికి వచ్చాను.
జనార్థన్: మమల్ని కాదు అనుకొని వెళ్లపోయావ్ నీకు ఆస్తి ఎందుకు.
అర్చన: నువ్వు అబ్బాయివా నీకు వాటా ఎందుకు. పెళ్లి చేసుకొని వెళ్లిపోయావ్ కదా.
రేవతి: ఆడపిల్ల అయితే వాటా ఇవ్వరా ఇదెక్కడి న్యాయం.
న్యాయం నేను చెప్తాను అని సీత చిన్నరాయుడిలా పంచె కట్టుకొని కండువా వేసుకొని వస్తుంది. చలపతి పెద్ద ఛైర్ వేసుకొని కూర్చొని తీర్పు ఇస్తానని అంటుంది. ఆస్తిలో ఆడవాళ్లకి సమాన హక్కు ఉందని అన్నగారు ఆ రోజే చెప్పారని చట్ట సభలోనూ ఆడపిల్లకి వాటా ఇవ్వాలని ఉందని చెప్తుంది. అందుకు రేవతికి వాటా ఇవ్వమని అంటుంది. తను చెప్తే మేం ఇవ్వాలా అని గిరిధర్, అర్చనలు ఎదురు తిరుగుతారు. నా శాసనం పాటించకపోతే మీకు అది మరణ శాసనం అవుతుందని చిన్న రాయుడమ్మ సీత అంటుంది. ఇంతలో మహాలక్ష్మీ కూడా పెద్ద రాయుడు గెటప్ వేసుకొని ఆపు నీ తీర్పు అని ఎంట్రీ ఇస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అర్జున్ రాకతో చివరి నిమిషంలో ట్విస్ట్.. మళ్లీ మిత్రనే ఛైర్మన్!