Nindu Noorella Saavasam Serial Today Episode:  ఘోర దగ్గరకు వెళ్లి భాగీ దీక్ష చేస్తుందని మనోహరి చెప్తుంది. నువ్వే ఎలాగైనా  దాన్ని ఇంట్లోంచి పంపించేయాలి అని అడుగుతుంది. దీంతో ఘోర కొంచెం టైం పడుతుంది అని చెప్పగానే నేను నిన్ను నమ్ముకుని నా టైం వేస్ట్‌ చేసుకున్నాను. నీకు సాయం చేసి నువ్వు నాకు సాయం చేస్తావని నేను చాలా తప్పు చేశాను. ఇక నీకు నాకు ఏ సంబధం లేదు అని మనోహరి వెళ్లిపోతుంటే.. ఘోర ఆపుతాడు.

ఘోర: మనోహరి నేను చెప్పేది విను.

మనోహరి: విని మోసపోయింది చాలు ఘెర. తప్పుకో నేను వెళ్లాలి. శక్తులు రావడం.. కోరుకున్నది జరగడం అన్నీ మాటలు మాత్రమే..

ఘోర: కాదని నిరూపిస్తే.. నీ కర్తవ్యం నీవు నిర్వహిస్తావా?

మనోహరి: ముందు నిరూపించు. ఆ తర్వాత నేను నిర్వర్తిస్తా..

   అని మనోహరి చెప్పగానే ఘోర సీసా తీసి మంత్రి చదివి ఎదురుగా వస్తున్న మహిళలోకి వెళ్లి ఆ స్త్రీని ఆవహించు అని సీసా మూత తీయగానే ఆరు ఆత్మ వెళ్లి ఆ ముసలామెను ఆవహిస్తుంది. వస్తున్న ఆ కారుకు ఎదురుగా పరుగెత్తు అని చెప్పగానే కారుకు ఎదురు పరుగెడుతుంది ఆ మహిళ. మనోహరి షాక్‌ అవుతుంది.

ఘోర: చూశావు కదా మనోహరి నా మాట నా మంత్రం. ఏదీ అబద్దం కాదు. ఇలాంటి మనోహన్నతమైన పనులు చేయాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ కావాలి.

మనోహరి: సరే ఇందాక ఏదో సాయం అన్నావు. ఏం కావాలి.

ఘోర: ఆ అమ్మాయి దీక్ష విరమించేలా చేయాలి. మానవుడికి మాధవుడు తోడైతే అప్పుడు ఇక మన కష్టం అంతా వృథా అవుతుంది.

అని చెప్పగానే ఆ దీక్ష మధ్యలోనే ఆగిపోయేలా చేస్తానని వెళ్లిపోతుంది. మరోవైపు భాగీ దీక్ష చేయడాన్ని భాగీ పూర్తి చేసేలా దీవించమని దేవుడిని కోరతాడు. ఇంతలో అమ్మవారు ఆ ఇంట్లోకి రావడం గుప్త చూస్తాడు. ఇంతలో పిల్లలు కూడా దీక్ష వేసుకుని రావడం చూసిన భాగీ ఆశ్యర్యపోతుంది.

గుప్త: ఏంటిది నేను చూచుతున్నది నిజమా.. కలయా..?

భాగీ: పిల్లలు ఏంటిదంతా మీరు..

అమ్ము: మేం కూడా నీలాగే అమ్మవారి దీక్ష చేస్తున్నాము మిస్సమ్మ.

నిర్మల: దీక్ష అంటే పట్టింపులు, సంప్రదాయాలు ఉంటాయి నాన్నా.. పైగా రోజంతా ఉపవాసం కూడా ఉండాలి.

అంజు: పర్వాలేదు నాన్నమ్మా అన్ని తెలుసుకునే దీక్ష చేయాలనుకున్నాం.

శివరాం: ఇంతకీ మీరెందుకు దీక్ష చేయాలనుకుంటున్నారు.

అమ్ము: ఎందుకో తెలియడం లేదు కానీ అంజు బర్తుడే నుంచి ఏదో బాధ తాతయ్యా కారణం తెలియడం లేదు.

అంజు: మిస్సమ్మ కూడా అలానే అనుకుని వేసుకుంది కదా? మేము కూడా మంచి జరుగుతుందని వేసుకున్నాం.

శివరాం: మంచి జరగాలని మీరనుకుంటున్నారు. కానీ మీ నాన్నకు ఇవన్నీ పట్టవు కదా? ఏంత గొడవ చేస్తాడో ఏంటో..?

రాథోడ్‌: మీరు మాట్లాడుకుంటుంది మా సారు గురించేనా సార్‌.

అంటూ రాథోడ్‌ పక్కకు జరగ్గానే అమర్‌ కూడా దీక్ష వేసుకుని వస్తాడు. అందరూ హ్యాఫీగా ఆశ్యర్యపోతారు.

భాగీ: ఏవండి నేను చూస్తుంది మిమ్మల్నేనా..? ఇవన్నీ మీరు నమ్మరు కదా?

అమర్‌: నేను ఎవర్ని నమ్ముతానో వాళ్లు నమ్ముతారు. అందుకే ఈ దీక్ష మనఃశాంతి తీసుకొస్తుంది అనుకుంటే అన్ని రోజుల దీక్షలో ఉండటానికి నేను రెడీ.

నిర్మల: మిస్సమ్మ నువ్వు ఏ ముహూర్తాన దీక్ష చేపట్టావే తెలియదు కానీ ఇంట్లో మంచి మార్పులు మొదలైనట్టే.

అమర్‌: మిస్సమ్మ ఈ దీక్ష ఎలా చేయాలో ఎం చేయాలో నువ్వే చెప్పు

 అని అమర్‌ అడగ్గానే దీక్ష నియమాలు చెప్తుంది మిస్సమ్మ. అందరూ సరే అంటారు. ఇంతలో రామ్మూర్తి వచ్చి అమర్‌ దీక్ష తీసుకోవడం చూసి హ్యాపీగా ఫీలవుతారు. ఎమోషనల్‌ గా ఫీలవుతారు. తర్వాత భాగీ పూజ మొదలుపెడుతుంది. ఇంతలో మనోహరి ఇంటికి వస్తుంది. రాథోడ్ తో ఇంట్లో ఈ పూజలు అంటే అమర్‌ కు పడదు కదా..? మిస్సమ్మను దీక్ష అయ్యే వరకు గుడిలో ఉండమని చెప్పుకూడదు అంటుంది. దీంతో రాథోడ్‌ నవ్వుతూ సూపర్‌ ఐడియా మేడం ఇదే ఐడియా వెళ్లి ఇంట్లో చెప్పండి అనగానే హ్యాపీగా మనోహరి లోపలికి వెళ్తుంది. అందరూ దీక్ష చేయడం చూసి షాక్‌ అవుతుంది.

మనోహరి: అమర్‌ ఏంటిదంతా  ఏం చేస్తున్నారు.

అమర్‌: అందరం అమ్మవారి దీక్షను చేస్తున్నాం

మనోహరి: అదే ఎందుకు..?

రాథోడ్‌: ఎందుకంటారు మేడంగారు మంచి మనసుతో మంచి జరగాలని మాల వేసుకున్నారు.   

మనోహరి: అసలు పిల్లు నువ్వు మాల వేసుకుని దీక్ష చేయడం ఏంటి అమర్‌.

భాగీ: ఏం మనోహరి గారు వాళ్లు దీక్ష చేయకూడదా? చేస్తే ఎవరికైనా నష్టమా..?

అంటూ భాగీ అడగ్గానే మనసులో అవునే నాకు నష్టమే అంటూ భాగీని తిట్టుకుంటూ అమర్‌ ఇవన్నీ నమ్మడు కదా? మీరంతా కలిసి బలవంతంగా మాల వేయించి ఉంటారు. అమర్‌ ఇబ్బంది పడతాడు అనగానే నువ్వన్నది నిజమే మనోహరి కానీ మంచి జరగాలని నేనే దీక్ష చేస్తున్నాను అని అమర్‌ చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!