Satyabhama Serial Today Episode రాత్రి క్రిష్‌ ఇంటికి వచ్చే వరకు మహదేవయ్య నిద్ర పోకుండా ఉంటాడు. క్రిష్ వచ్చి బాపు ఏమైంది అని అడుగుతాడు. నువ్వు ఇంతకు ముందులా లేవు నా మాట వినకుండా ఎదురు తిరుగుతున్నాని అంటాడు. అలా ఏం లేదు ఏం చేయాలని క్రిష్‌ అంటాడు. దానికి మహదేవయ్య క్రిష్‌తో ఇప్పుడు నీకు నీ కంటూ నీ సొంత వాళ్లు ఉంటారు. వాళ్ల బాధ్యత కూడా నువ్వు చూడాలి కదా అంటాడు.


క్రిష్‌: నీ కంటే నాకు వేరే ఏ బాధ్యత లేదు బాపు. నేను నా గురించి ఆలోచించే ముందు నీ గురించి ఆలోస్తా. నేను మారాను అని నీకు అనిపించిన రోజు నీ చిన్నా నీ కంటికి కనిపించడు బాపు.
మహదేవయ్య: అంత పెద్ద ఎందుకురా.
క్రిష్‌:  దయచేసి నాతో నమ్మకం లేదు అనకు బాపు నన్ను చంపినంత బాధ అని పిస్తుంది. 
మహదేవయ్య: నీ కోసం సత్య వెయిట్ చేస్తుంటుంది. ముందు వెళ్లు తర్వాత మాట్లాడుకుందాం.
క్రిష్: బాపునకి నాతో పని ఉంది అంటే దేవుడు పిలిచినా వెళ్లను బాపు. 
సత్య: మనసులో మళ్లీ ఉచ్చు బిగిస్తున్నారు.
మహదేవయ్య: రేపు మనం హైదరాబాద్ వెళ్లాలి.
క్రిష్‌: సరే బాపు
మహదేవయ్య: చిన్నా ఎందుకు అని అడగవా ఆ నర్శింహ గాడు అధిష్టానాన్ని కలుస్తున్నాడు. వాడికంటే ముందే మనం అధిష్టాన్ని కలుద్దాం మన దిక్కు ఉంటే సరే సరి లేదంటే వాడిని వేసేద్దాం. ఏంట్రా చిన్నా ఆలోచిస్తున్నావ్.
క్రిష్‌: అన్న జైలులో ఉన్నాడు నేను కూడా పోతే నిన్ను ఎవరు దగ్గరుండి చూసుకుంటారు.
మహదేవయ్య: అంత వరకు ఆలోచించకు నీ మీదకి ఎవరైనా వస్తే నేను చూసుకుంటా. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా ఎందుకంటే నువ్వే నా ప్రాణం కాబట్టి.
క్రిష్: సరే బాపు. 
మహదేవయ్య: సత్యతో బాపునకి నన్ను పిలిచినప్పుడు దేవుడు పిలిచినప్పుడు కూడా పోడట దాని అర్థం ఏంటో తెలుసా నీ మొగుడు ఇంకా నా గుప్పెట్లోనే ఉన్నాడు. 
సత్య: ఎందుకు క్రిష్ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
మహదేవయ్య: అది చెలగాటం కాదు ఈ మహదేవయ్య ఆట. నా కోసం నీ మొగుడు కత్తి పట్టుకొని తిరగాల్సిందే. నా కోసం అవసరం అయితే చావాల్సిందే. ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేయాలి అనుకుంటే చూస్తూ ఊరుకుంటానా. రేపు పార్టీ ఆఫీస్లో జరిగే మారణాయుధానికి నీ మొగుడే సూత్ర ధారి అవుతాడు చూసుకో. ఈ దెబ్బతో నువ్వు ఎక్కువో నేను ఎక్కువో తేలిపోతుంది. పిచ్చోడిని అయి పచ్చబొట్టు వేయించుకోలే నీ భర్తని పిచ్చోడిని చేయడానికి వేసుకున్నా.


సత్య ఆలోచిస్తూ ఉంటే క్రిష్ గదిలోకి వెళ్లి ఏమైందోయ్ అంతలా ఆలోచిస్తున్నావ్ అని అంటాడు. సత్య క్రిష్‌తో ప్రేమగా ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతుంది. క్రిష్‌ సరే అంటే అయితే రేపు వెళ్దామా అని సత్య అంటుంది. దానికి క్రిష్ రేపు కుదరదు వేరే పని ఉందని అంటాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు గిల్లిగజ్జాలు పెట్టుకుంటారు. ఎక్కడికి వెళ్తావో చెప్పమని అంటుంది. దానికి క్రిష్ హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్తాడు. నన్ను కూడా తీసుకెళ్లు అని అంటుంది. క్రిష్ వద్దని కోప్పడతాడు. సత్య వదలదు బుంగ మూతి పెట్టి ముద్దు పెడుతుంది. దాంతో క్రిష్ మనసులో అబ్బా నా వీక్ పాయింట్ మీద కొడుతున్నావ్ సత్య అనుకుంటాడు. ఇక నువ్వు ఇలా చేస్తుంటే ఎక్కడికీ వెళ్లకుండా నీతో పాటు గదిలో ఉండిపోవాలని అంటాడు. మొత్తానికి క్రిష్ ఒప్పుకొని సర్దేయ్ ఇద్దరి బట్టలు సర్దేయ్ అంటాడు.


ఉదయం మహదేవయ్య బ్యాగ్‌తో హాల్‌లో సిద్ధంగా ఉంటాడు. సంజయ్ వస్తే భైరవి సంజయ్‌ని సరిగా పట్టించుకోకపోతే భైరవికి చీవాట్లు పెడతాడు. ఇక సత్య క్రిష్ దగ్గర గొడవలు పడొద్దని మాట తీసుకుంటుంది. ఇద్దరూ తమ లగేజ్‌తో కిందకి వస్తారు. మహదేవయ్య నువ్వు రావేమో సత్య వెళ్లొద్దని అన్నాదేమో ఆగిపోయావేమో అని అంటాడు. దాంతో క్రిష్ కరెక్ట్‌గా చెప్పావు బాపు సత్య నన్ను ఆపిందని అంటాడు. ఇక సత్య క్రిష్‌ నా మాట వినకపోయినా నేను క్రిష్ వెనకే వెళ్లాలని అంటుంది. భైరవి వద్దని అంటుంది. మహదేవయ్య మాత్రం రామ్మని అంటాడు. ఇక ముగ్గురూ బయల్దేరుతారు. సంజయ్ మనసులో మొగుడు లేకుండా ఒంటరిగా దొరుకుతావు అనుకుంటే పారిపోయావు నిన్ను వదలను నీడలా వెంటపని నా దారిలోకి తెచ్చుకుంటా అంటాడు. ఇక భైరవి, పంకజం మాట్లాడుకుంటారు. కోపంగా ఉన్న భైరవిని పంకజం రెచ్చగొడుతుంది. సత్యని ఎలా అయినా తరిమేయాలని చిన్నా, మహదేవయ్యల దృష్టిలో సత్యని బ్యాడ్ చేసి తరిమేస్తా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్ ప్రోమో: దమ్ముంటే ఆ విషయంలో చిన్నాని ఆపు: సత్యతో మహదేవయ్య ఛాలెంజ్