Psycho Stabbing Cattle In Kurnool District: ఆ ఊరిలో పశువులు రాత్రైతే చాలు మూగ వేదనను అనుభవిస్తున్నాయి. అర్ధరాత్రి సైకోలు వాటిపై కత్తితో దాడి చేస్తూ వీరంగం సృష్టిస్తున్నారు. కర్నూలు జిల్లా (Kurnool District) గోనెగండ్లలో (Gonegandla) ఈ దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందున్న ఆవులు, ఎద్దులు, గొర్రెలను.. కత్తులతో తీవ్రంగా పొడిచి వెళ్లిపోయారు. ఆ కత్తిపోట్లకు పశువులు తీవ్ర రక్తస్రావంతో ఆర్తనాదాలు పెట్టాయి.


వీటి అరుపులు గమనించిన వాటి యజమానులు వాటిని చికిత్స నిమిత్తం పశు వైద్యశాలకు తరలించారు. దాదాపు 10 పశువులపై దాడి చేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూగజీవాలపై ఇంత పాశవికంగా దాడి చేయడం అమానుషమని పశువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వీటిపైనే జీవనం సాగించే వాళ్లమని.. ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇది గ్రామానికి చెందిన వ్యక్తి చేసిన పనేనా.. లేక ఏదైనా కక్ష పెట్టుకుని ఇలా చేస్తున్నారా.? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Viral News: ఫుల్లుగా మద్యం సేవించాడు - బస్సెక్కి నిద్రపోయాడు, కండక్టర్ ఏం చేశారంటే?