Sharmila Tears: జగన్ కోసం ఎంతో చేశానని కానీ జగన్ తన చెల్లి కోసం ఏమీ చేయలేదని పైగా ఆస్తుల విషయంలో మోసం చేస్తున్నారని ఆయన సోదరి షర్మిల కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల తనకు జగన్ చేసిన అన్యాయం గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తాను జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేశానన్నారు. పాదయాత్రలు చేశామని ఏ పని చెబితే ఆ పని చేశానన్నారు. మరి జగన్ తన కోసం ఏం చే్శాో చెప్పాలని అడిగారు. ఏమీ చేయకపోగా ఇప్పుడు ఆస్తుల విషయంలో, తన బిడ్డలకు అన్యాయం చేయాలని అనుకుంటున్నారని ఆవేనద వ్యక్తం చేశారు.
సాక్షి పత్రికలో జగన్ షర్మిలకు అన్ని ఆస్తులు పంచేశారని ప్రచురించడంతో నాలుగుపేజీల లేఖను షర్మిల విడుదల చేశారు. ఆ లేఖలో షర్మిల .. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, కేవీపీ రామచంద్రరావుల సమక్షంలోనే వైఎస్ నోటి మాట ద్వారా ఆస్తుల పంపకాలు చేశారని షర్మిల పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రెస్ మీట్ పెట్టిన సుబ్బారెడ్డి ఆ ఆస్తులన్నీ జగన్ వేనని.. అవన్నీ షర్మిల ఆస్తులు అయితే ఆమె కూడా జైలుకు వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో కలత చెందిన షర్మిల ప్రెస్ మీట్ పెట్టారు. చాలా ఆస్తులు భారతి పేరు మీద ఉన్నాయని సుబ్బారెడ్డి లాజిక్ ప్రకారం భారతి కూడా జైలుకు వెళ్లాలి కదా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి జగన్ ఇచ్చిన పదువుల్ని తీసుకుని ఆర్థిక ప్రయోజనాలు కూడా పొంది ఉన్నారు కాబట్టి వారు నిజాలు మాట్లాడే అవకాశం లేదని తెలిసినా వారి గురించి తన తెలియాలన్న ఉద్దేశంతోనే ఆ లేఖల్లో పేరు పెట్టానన్నారు. నిన్నసుబ్బారెడ్డి రేపు విజయసాయిరెడ్డి కూడా వెలుగులోకి వచ్చి వస సుబ్బారెడ్డి మాట్లాడినట్లే మాట్లాడతారని అందులో వింత ఏమీ ఉండదని స్పష్టం చేశారు. కానీ ఓ ఆడబిడ్డకు తమ స్వార్థం కోసం ఇంత అన్యాయం చేయాలని ఎందుకు అనిపిస్తోందని.. ఒక్క సారి అయినా ఆలోచించరా అని షర్మిల ప్రశ్నించారు. వైపీసీ విజయాల కోసం తాను ఎంతో శ్రమించానని.. తాను ఏం తప్పు చేశానో చెప్పాలని వైసీపీ కార్యకర్తలు, నేల్ని కోరారు.
ఆస్తుల విషయంలో జగన్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. ఎవరైనా గిఫ్ట్ డీడ్ చేయాలనుకుంటే ఎంవోయూ చేస్తారా అని ప్రశ్నించారు. తనకు రావాల్సినవి ఇవ్వడానికి మాత్రమే ఎంవోయూ చేశారని దానిలో భాగంగా వచ్చిన డివిడెండ్లు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. ఇప్పుడు కన్నతల్లిని కోర్టుకు లాగడమే కాకండా.. ఘర్ ఘర్ కీ కహానీ అంటున్నారని మండిపడ్డారు. షర్మిల తన తల్లి గురించి. జగన్ చేసిన మోసం గురించి చెబుతున్న సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. గొంతులో నుంచి మాటలు రాలేదు. అందుకే కాసేపటికే ప్రెస్‌మీట్ పూర్తి చేసి వెళ్లిపోయారు.