KTR accused Revanth government of running with destruction and diversions: రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిస్ట్రక్షన్, డైవర్షన్‌తోనే కాలం గడిపేస్తోందని ప్రజాసమస్యలను పరిష్కారం చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఏబీపీ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఫ్యానల్ చర్చలో పాల్గొన్న ఆయన తర్వాత ఏబీపీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. ఆరు గ్యారంటీలు కాస్తా హాఫ్ గ్యారంటీగా మారిపోయిందన్నారు. ఆస్పత్రుల్లో మందులు కూడా ఉండటం లేదని పేద ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వానికి ప్రజుల బుద్ది చెబుతారన్నారు.
జగన్ కోసం ఎంతో చేశా - ఇంత అన్యాయం చేస్తారా ? కంట తడి పెట్టుకున్న షర్మిల
మూసీలో లూఠీకే వ్యతిరేకం
మూసి సుందరీకరణ పేరుతో అతి పెద్ద స్కాం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మూసిని పూర్తిగా ప్రక్షాళన చేసినా పాతిక వేల కోట్లు కూడా ఖర్చు కాదన్నారు. మరి లక్షన్నర కోట్లు ఎలా ఖర్చు పెడతారని కేటీఆర్ ప్రశ్నించారు. దక్షిణ కొరియాలో మంత్రులు చూసి వచ్చిన నదిని కూడా ఆరు వేల కోట్లతోనే పునరుజ్జీవింప చేశారని గుర్తు చేశారు. గుజరాత్‌లో సబర్మది నదిని కూడా తక్కువ ఖర్చుతో పూర్తి చేశారని కానీ ప్రపంచంలో ఎక్కడా ఏ నది ప్రక్షాళనకు పెట్టనంత ఖర్చు మూసి నదిపై పెట్టేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయిందన్నారు. ప్రతి పథకానికి డబ్బులు లేవంటున్నారని కానీ మూసీకి మాత్రం లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.
కేసులు పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి !
ప్రజా సమస్యలపై మాట్లాడితే కేసుల పెరుతో బెదిరిస్తున్నారని ఏం పీక్కుంటారో పీక్కోవాలని కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. పది నెలలుగా ఏ కేసులోనూ సాక్ష్యాలు లేక ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. దక్షిణ కొరియాకు వెళ్లి వచ్చే నెల నుంచి అరెస్టులు ఉంటాయని పొంగులేటి శ్రీనివసారెడ్డి అంటున్నారని ఆయన ఇంట్లో జరిగిన ఈడీ సోదాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేసులకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు.
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ సందర్బంగా మా ప్రతినిధి శేషుకు ఇచ్చిన పూర్తి ఇంటర్యూ ను ఈ లింక్‌లో చూడవచ్చు.