అన్వేషించండి
Advertisement
Top Headlines Today: లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు, చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్- వంటి టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Todays Top 10 headlines:
1. లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తాం: చంద్రబాబు
లడ్డు కల్తీ వ్యవహారంపై ఐజీ, ఆపై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై పరిహారం కోసం మహాశాంతి హోమం చేయాలని ఆగమ సలహామండలి నిర్ణయించింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగ్రవ్యప్రోక్షణ చేస్తారు.' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. వైసీపీ ఆలయాలను అపవిత్రం చేసిందన్న పవన్
గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'గత ప్రభుత్వంలో రథాలు తగులబెట్టారు. ఆలయాలను అపవిత్రం చేశారు. రాముడి విగ్రహంలో తల తొలగిస్తే ఆనాడు పోరాడాము. ఏ మతమైనా సరే వారి మనోభావాలు దెబ్బతినకూడదు. ప్రసాదాలు కల్తి, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పాము.' అంటూ పవన్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐ, పాలిటెక్నిక్
తెలంగాణలోని ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను 'స్కిల్ యూనివర్సిటీ' పరిధిలోకి తేవాలని రేవంత్‌రెడ్డి సర్కార్ యోచిస్తోంది. దీనిపై అవసరమైన విధివిధానాలను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిశ్రమల అవసరాల మేరకు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చాలని ఆదేశించారు. సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. 25 విల్లాలు, 44 భవనాలను కూల్చేసిన హైడ్రా
హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. కూకట్‌పల్లి నల్లచెరువు, అమీన్‌పూర్‌లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన 25 విల్లాలు, 44 భవనాలను కూల్చేసింది. ఇళ్లను నిర్మించుకుని నివాసముంటున్నవారి వద్దకు హైడ్రా అధికారులు వెళ్లలేదు. మూడు ప్రాంతాల్లో మొత్తం 8 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వాటి విలువ రూ.200 కోట్లు ఉంటుందని వెల్లడించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. మూడు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ఏపీ, తెలంగాణల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో మన్యం, అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. మళ్లీ భారత్‌కు బంగ్లాదేశ్ "పులస"
మాజీ ప్రధాని హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సెప్టెంబర్లో.. భారత్‌కు పులస ఎగుమతిపై నిషేధం విధించింది. తాజాగా ఈ నిషేధాన్ని యూనస్ ప్రభుత్వం ఎత్తేసింది. రాజకీయ వివాదాలు.. వాణిజ్యంపై ప్రభావం చూపకుండా ఉండేందుకు బంగ్లా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సంప్రదింపులతో 3 వేల టన్నుల పులస చేప సరఫరాకు అనుమతించింది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో బంగ్లా పులస ఎగుమతి చేస్తుండేది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్
45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఆఖరి రౌండ్‌లో అపోనెంట్లను ఓడించి పురుషులు, మహిళల జట్లు రెండు విభాగాల్లో తొలి బంగారు పతకాలను కైవసం చేసుకున్నాయి. ఆదివారం హంగేరి రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. కాగా, ఇదే టోర్నీలో 2014, 2022లో భారత పురుషుల జట్టు రెండు కాంస్యాలను సాధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. చిరంజీవిని వరించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు
చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. తన మేనరిజంతో ప్రేక్షకుల ఆదరణ పొంది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవికి ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఆదివారం హైదరాబాద్ ఐటీసీ కోహినూర్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ వేడుకల్లో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌ను చిరంజీవి అందుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
పరిమితికి మించి అభిమానులు రావడంతో ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయ్యింది. వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు నిలువరించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆర్గనైజర్స్ ఈవెంట్‌ను రద్దు చేశారు. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈనెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. మీకంటే ఎక్కువ నాకే బాధ: ఎన్టీఆర్
దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందించారు. అభిమానులంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. 'ఇది చాలా బాధాకరం. అవకాశం ఉన్నప్పుడు అభిమానులతో సమయం గడపాలని, సినిమా గురించి వివరించాలని అనుకున్నా. కానీ భద్రతా కారణాలతో ఈవెంట్ రద్దైంది. నేనూ బాధపడుతున్నా. ఇలా జరిగినందుకు ఎవరినీ నిందించవద్దు. మీ ప్రేమకు రుణపడి ఉంటా' అంటూ తారక్ ఓ వీడియో విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement