Top 10 Headlines Today: చంద్రబాబుకు ఐటీ నోటీసులు- పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు దేని కోసం ? మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
చంద్రబాబుకు ఐటీ నోటీసులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా ఆయన వంద కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయని ఆ కథనం సారాంశం. చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగస్టు 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. షోకాజ్ నోటీసుల్లో.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఐటీ శాఖ ప్రశ్నించిందట. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్రత్యేక సమావేశాలు దేని కోసం
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమయింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సమావేశాలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే దేశంలో ముందస్తు ఎన్నికలకు కేంద్రం ప్లాన్ చేసిందని చెబుతున్నారు. డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయని I.N.D.I.A కూటమి నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ కూడా అందుకోసమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఒకే టైంలో సమావేశాలు
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలుు మూడో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలల్లోపు ఓ సారి అసెంబ్లీని ఖచ్చితంగా సమావేశపర్చాల్సి ఉంటంది. ఈ నిబంధన అమలు చేయడానికి అయినా అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉంటుంది. అదే సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంతో డిసెంబర్ ఎన్నికల కోసం ఏపీ ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా రెడీ అవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కాంగ్రెస్‌లోకి తుమ్మల
బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ లభించకపోవడంతో అసంతృప్తికి గురైన తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లోని తుమ్మల నివాసంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు వెళ్లి కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరే ఉద్దేశం ఉండటంతోనే వారిని తన నివాసానికి తుమ్మల ఆహ్వానించారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు సుదర్శన్ రెడ్డి, మల్లు రవి కూడా ఉన్నారు. వారందరినీ తమ్ముల నాగేశ్వరరావు శాలువాలతో సన్మానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
శ్రీలంక బోణీ
ఆసియా కప్‌ను శ్రీలంక విజయంతో ప్రారంభించింది. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక 39 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ మతీష పతిరానాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వర్షాలు పడే ఛాన్స్
పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఒకటి కోస్తా ఆంధ్రప్రదేశ్ కు దగ్గర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (ఆగస్టు 31) ఓ ప్రకటనలో తెలిపారు. మరో ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 4వ తేదీన ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు ఈశాన్య /వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చంద్రునిపై ప్రకంపనలు
భూమీద ప్రకంపనలు వస్తే భూకంపం అంటారు. అదే చంద్రుడి మీద ప్రకంపనలు వస్తే..? ప్రస్తుతానికి చంద్రకంపం అనుకుందాం. ఇలాంటి ఓ యాక్టివిటీని ఎక్స్ పీరియన్స్ చేశాయి చంద్రుడి సౌత్ పోల్ దగ్గర్లో ఉన్న చంద్రయాన్ - 3లోని విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్. ఆగస్టు 26న వచ్చిన ఈ ప్రకంపనలను ల్యాండర్, రోవర్ రెండూ నమోదు చేశాయి. ల్యాండర్ లో ఉన్న ఓ పేలోడ్ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ ది లూనార్ సెసిమిక్ యాక్టివిటీ (ILSA) ఈ ప్రకంపనలను రికార్డు చేసింది. ఈ పేలోడ్ చంద్రుడిపైన దిగిన మొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ (MEMS) టెక్నాలజీ ఆధారిత ఇన్‌స్ట్రుమెంట్ అని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ల్యాండర్, రోవర్ కొంత వైబ్రేషన్స్ కు గురవడాన్ని రికార్డు చేసిందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
భారత్ ఘన విజయం
ఓమన్ లోని సలాల వేదికగా జరుగుతున్న Asian Hockey 5s World Cup Qualifiersలో భారత హాకీ జట్టు గోల్స్ జాతర చేసుకుంటున్నది. మలేషియా, జపాన్‌లపై భారత్ ఘన విజయాలు సాధించింది. తొలుత భారత్ 7-5 తేడాతో మలేషియాను ఓడించింది. ఆ తర్వాత జపాన్‌పై ఏకంగా 35 గోల్స్ చేసింది. జపాన్ తరఫున ఒకే ఒక్క గోల్ నమోదైంది. వరుసగా రెండు విజయాలతో భారత్.. ఎలైట్ గ్రూప్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుని సెమీస్‌కు చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తేనె పట్టిస్తున్నారా?
చిన్న పిల్లలకు జలుబు చేసినప్పుడు తల్లిదండ్రులు తేనె పట్టిస్తారు. అది ఇవ్వడం వల్ల జలుబు నుంచి వాళ్ళకి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. తేనె సహజ స్వీటేనర్ మాత్రమే కాదు ఉత్తమమైన ఆహారాలలో ఒకటి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పని చేస్తుంది. కాలిన గాయాలకు, దగ్గుకి చికిత్స చేసేందుకు తేనె ఉపయోగిస్తారు. దీన్ని తినడానికి పిల్లలు కూడా ఎంతో ఇష్టం చూపిస్తారు. ఆయుర్వేదం ప్రకారం తేనె పిల్లల్లో పొడి దగ్గును తగ్గిస్తుంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏడాది కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వడం ప్రమాదకరం. కొన్ని అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 12 నెలల కంటే తక్కువ వయసు పిల్లలకు తేనె పట్టిస్తే ప్రాణాంతకం కావచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నిద్రలేచిన వెంటనే వీటిని తాగండి
నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం అలవాటు. ఇవి పరగడుపునే తాగడం ఆరోగ్యకరం కాదని తెలిసినా అవి తాగకపోతే మనసు ఊరుకోదు. వీటిని తీసుకుంటే కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోషకాల శోషణకి ఆటంకం ఏర్పడుతుంది. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు దారి తీస్తుంది. అందుకే దానికి బదులుగా ఆరోగ్యకరమైన ఈ పానీయాలు ఎంచుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి