అన్వేషించండి

Top Headlines Today: నేడు తెలంగాణ సీఎం పేరు ఖరారు; జంపింక్‌కు రెడీ అవుతున్న ఎమ్మెల్యేలు - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

సీఎం ఎవరో సోమవారం సీఎల్పీ భేటీలో డిసైడ్ అవుతుంది: డీకే శివకుమార్

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతల బృందం రాజ్ భవన్ కు వెళ్లింది. గర్నవర్ తమిళిసైని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ తమిళిసైకి అందజేశారు. గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. గవర్నర్ ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ కు కాంగ్రెస్ నేతలు లేఖ అందజేశారు. ఇంకా చదవండి

తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీపై ఉంటుందా?

దక్షిణాదిన ఇటీవలి కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సిట్టింగ్ ప్రభుత్వాలను సహించలేకపోతున్నారు. వారిని సాగనంపడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక  ( Karnataka Elections )  తర్వాత తెలంగాణలోనూ అదే జరిగింది. వచ్చే నాలుగు నెలల్లో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీపై ఉంటుందా ఉండతా అన్న చర్చ  ప్రారంభమయింది. నిజానికి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలగు రాష్ట్రాల రాజకీయాలుక పొంతన లేకుండా పోయింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇంకా చదవండి

బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ వికెట్, కాంగ్రెస్ లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే!

తెలంగాణలో గత ఎన్నికల తరువాత సీన్లు మరోసారి రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. వరుసగా రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి అధికారంలోకి రాగా, విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. తాజాగా ఎన్నికల ఫలితాలు (Telangana Election Results 2023) వచ్చిన కొన్ని గంటల్లోనే భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెంట ఉన్నారు. ఎస్టీ రిజర్వుడ్ అయిన భద్రాచలం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలుపొందారు. ఇంకా చదవండి

రేపు తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం 

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుఫాను  (MIGJAUM) గత 6 గంటల్లో 5 kmph వేగంతో వాయువ్య దిశగా కదిలింది. డిసెంబర్ 3, 2023 IST 08.30 గంటల IST అక్షాంశం 11.5 సమీపంలో అదే ప్రాంతంలో  పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 290 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 290 కి.మీ, నెల్లూరుకు ఆగ్నేయంగా 420 కి.మీ, బాపట్లకు ఆగ్నేయ దిశలో 530 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 530 కి.మీ. కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ, మరింత బలపడి, డిసెంబర్ 4వ తేదీ ఉదయం నాటికి దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. ఇంకా చదవండి

కాంగ్రెస్ విజయం వెనుక తెర వెనుక శక్తి సునీల్ కనుగోలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పాత్ర చాలా ఎక్కువ. స్ట్రాటజిస్టుగా సునీల్ కనుగోలు..బాధ్యతలు తీసుకున్న తర్వాత కర్ణాటకలో గెలిపించారు. ఆ తర్వాత తెలంగాణ బాధ్యతలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజా నాడి పడుతూ.. గెలుపు గుర్రాలైన అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి ప్రచార వ్యూహాలను క్రియేటివ్ గా చేయడం వరకూ మొత్తం సునీల్ కనుగోలు చూసుకున్నారు. ఇంకా చదవండి

కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

ఎప్పుడు? ఎప్పుడు? ఎప్పుడు? రాకీ భాయ్ యశ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు? అని కర్ణాటకలో అతని అభిమానులు మాత్రమే కాదు... 'కెజియఫ్' చూసి అతని నటనకు అభిమానులుగా మారిన ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు యశ్. అది కూడా నేరుగా కాదు లెండి... ఇన్ డైరెక్టుగా! ఇంకా చదవండి

రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. వరుసగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీపై విజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)ది కీలక పాత్ర. ఆయనకు పలువురు అభినందనలు చెబుతున్నారు. అందులో తప్పు లేదు. అయితే... ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కుమార్తె బండారు సుప్రీతా నాయుడు పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ మాత్రం చర్చనీయాంశం అవుతోంది. ఇంకా చదవండి

'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కిన 'యానిమల్'(Animal) మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్ బీర్ తన నట విశ్వరూపం చూపించాడు. దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ మేకింగ్, స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాలో వైలెన్స్ తో పాటు బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నా కూడా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంకా చదవండి

ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

దేశంలో రెండో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ (Adani Group) ఓనర్‌, వ్యాపార విస్తరణ విషయంలో దూకుడుగా ఉండే గౌతమ్ అదానీ... తన గ్రూప్‌ బిజినెస్‌ పెంచుకోవడానికి మరో మెగా ప్లాన్‌ వేశారు. దేశంలోని మౌలిక సదుపాయాల (infrastructure) రంగంలో 7 లక్షల కోట్ల రూపాయల ( 84 బిలియన్ డాలర్లు‌) పెట్టుబడి పెట్టాలని అదానీ గ్రూప్‌ యోచిస్తోంది. వచ్చే పదేళ్లలో ఈ మొత్తాన్ని ఇన్‌ఫ్రా సెక్టార్‌లోకి అదానీ గ్రూప్‌ పంప్‌ చేస్తుంది. ఇంకా చదవండి

ఛత్తీస్‌గఢ్‌లోనూ బీజేపీదే అధికారం, కాంగ్రెస్‌ ఆశలన్నీ అడియాసలే

త్తీస్‌గఢ్‌లో రెండోసారి అధికారంలో (Chhattisgarh Election Result 2023) రావాలన్న కాంగ్రెస్‌ లక్ష్యం గురి తప్పింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ఫలితాలే ఇక్కడా రిపీట్ అయ్యాయి. 90 నియోజకవర్గాలున్న ఛత్తీస్‌గఢ్‌లో మెజార్టీ మార్క్ సాధించింది బీజేపీ. 54 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ వెనుకంజ వేసింది. 35 స్థానాలు మాత్రమే సాధించుకోగలిగింది. కాంగ్రెస్ చేతిలో ఉన్న రాజస్థాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌నీ తన ఖాతాలో వేసుకుంది కాషాయ పార్టీ. అలా రెండు రాష్ట్రాలకూ ఆ పార్టీని దూరం చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చినప్పటికీ...ఫలితాలు అందుకు వైరుధ్యంగా వచ్చాయి. ముందు నుంచీ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ లీడ్‌లో దూసుకుపోయింది. ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌ని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేసింది బీజేపీ. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget