Top Headlines Today: బాలాపూర్ గణేశ్ లడ్డూకు భారీ ధర; జస్టిస్ హిమబిందుపై పోస్టులు చేసిన వ్యక్తి అరెస్ట్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. వేల మంది భక్తుల నడుమ గణేష్ శోభాయాత్రలు ఘనంగా సాగుతుండగా.. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తి అయింది. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడిని చేరాడు. ఖైరతాబాద్ గణేషుడి వద్ద బుధవారం అర్ధరాత్రి దర్శనాలు నిలిపేశారు. రాత్రి 12 గంటలకు చివరి పూజ నిర్వహించారు. గురువారం వేకువ జామునే ఖైరతాబాద్ పార్వతీ తనయుడి విగ్రహాన్ని తరలించడం ప్రారంభించారు. ఇంకా చదవండి
రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్ రెడ్డి
హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణపతి ఎంత ఫేమస్సో... బాలాపూర్ లడ్డూ వేలం కూడా అంతే ఫేమస్. అందుకే గణేష్ నిమజ్జనం టైంలో బాలాపూర్ లడ్డూ ఎవరు పాడారు. ఎంతకు పాడారు అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతూ ఉంటుంది. ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ కోసం భక్తులు పోటీ పడ్డారు. గత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త చరిత్రను సృష్టించిందీ లడ్డూ. 30వసారి జరిగిన లడ్డూ వేలాం ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటలో 36 మంది భక్తులు పాల్గొన్నారు. ఇంకా చదవండి
జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసుతో ఏపీ మొత్తం హీటెక్కిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించినప్పటి నుంచి ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. చంద్రబాబును జైలుకు పంపించారన్న కోపంతో జడ్జి హిమబిందును కించపరుస్తూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన నంద్యాల పోలీసులు... జడ్డి హిమబిందుపై పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంకా చదవండి
ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ షెడ్యూల్-వచ్చే నెలలో 30 నుంచి 40 సభలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయని సమాచారం. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ... డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు విడతల వారిగా పేదలకు అందిస్తూ.. ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇక.. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూ బిజీబిజీగా ఉంది. ఇక... బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధంగా ఉంది. ఎన్నికలకు సమయంలో ఎక్కువగా లేకపోవడంతో... రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇంకా చదవండి
కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు!
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. సామాన్యులకు ప్రభుత్వ సేవలను క్షేత్రస్థాయిలో అందించేందుకని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఇవి స్థానిక సంస్థల అధికారాలను లాగేసుకున్నాయని ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న వాదన వినిపిస్తోంది. ఇంకా చదవండి