By: ABP Desam | Updated at : 28 Sep 2023 07:00 AM (IST)
గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?
AP News : రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. సామాన్యులకు ప్రభుత్వ సేవలను క్షేత్రస్థాయిలో అందించేందుకని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఇవి స్థానిక సంస్థల అధికారాలను లాగేసుకున్నాయని ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న వాదన వినిపిస్తోంది.
స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా
74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదాను అందించింది. ఈ చట్టం భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో పేర్కొన్న 18 విధులు నిర్వహించేందుకు పట్టణ స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చింది. వాటిలో 13 విధులను పూర్తిగాను, మూడు విధులను పాక్షికంగానూ నగర పాలక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇక పురపాలక / నగర పంచాయతీల విషయానికి వస్తే ఏడు విధులను పూర్తిగాను, ఐదు విధులను పాక్షికంగానూ అప్పగించింది.
స్థానిక సంస్థల అధికారాలు గ్రామ , వార్డు సచివాలాయలకు
వార్డు, గ్రామ సచివాలయాల వ్యవస్థను 2019 జులై నుంచి నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో రాష్ట్రప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది స్థానిక సంస్థలు ఎన్నికైన ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా రాష్ట్రప్రభుత్వ కనుసన్నల్లో... ప్రత్యేక అధికారుల పాలనలోనే మగ్గుతున్నాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పౌరులను భాగస్వామ్యం చేయడం, పౌరులకు పాలనను చేరువ చేయడం స్థానిక స్వపరిపాలన ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో ఎక్కడా వార్డు కమిటీలను ఏర్పాటు చేయనే లేదు. ఇక పౌరులను భాగస్వామ్యం చేసే పరిస్థితి అసలు లేదు. ఇవి రెండూ చేపట్టకుండా వార్డు స్థాయిలో సచివాలయాల వ్యవస్థ రూపుదిద్దుకోవడం స్థానిక స్వపరిపాలనకు ఉద్దేశించిన రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చడమేనని కాగ్ చెప్పింది.
కోర్టుల్లోనూ పిటిషన్లు
గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధతపై ఇప్పటికీ స్పష్టత లేదు. కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో అధికారాల్ని సర్పంచ్ లు, కార్యదర్శుల నుంచి వీర్వోలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టి వేసింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తీసుకొచ్చిన గ్రామ సచివాలయాల్లో అధికారాలు ఎవరికి ఉండాలనే దానిపై గతంలో పలు వాదనలు జరిగాయి. చివరికి ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ లు, కార్యదర్శులకు ఉన్న అధికారాల్ని వీఆర్వోలకు కట్టబెట్టేందుకు వీలుగా జీవో నంబర్ 2 జారీ చేసింది. అయితే దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పంచాయతీ రాజ్ వ్యవస్ధ ఉండగా సచివాలయాల ఏర్పాటే తప్పిదమని, అలాంటిది వాటి అధికారాల్ని కూడా వీఆర్వోలకు కట్టబెట్టడం సరికాదనే విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం అధికారాల బదిలీకే మొగ్గుచూపింది.చివరికి కోర్టు కొట్టి వేసింది.
చట్టబద్దత ఇప్పటికీ లేదా ?
గ్రామీణ, పట్టణ ప్రజలకు 540 రకాల సర్వీసులను అందించేందుకు పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధిశాఖలతో పాటు గ్రామ/వార్డు సచివాలయాల శాఖకు కూడా చట్టబద్ధత కల్పించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. 540 కంటే ఎక్కువ సేవలు అందించేందుకు గ్రామ/వార్డు సచివాలయాలకు వీలు కల్పిస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవస్థలకు అనుబంధంగా సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకే చోట సేవలను అందించే కేంద్రంగా పనిచేసేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు అత్యవసరమైనందున దీనిని తీసుకొచ్చినట్లు ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ కాలపరిమితి తీరింది.
మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ
Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్
Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు
Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్- తప్పులేదన్న సజ్జనార్
/body>