Top Headlines Today: పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు; రేవంత్ వ్యాఖ్యలపై భగ్గు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బీజేపీ .. టీడీపీ , జనసేనతో కలిసి పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ‘‘ఎవరెవరో మాట్లాడిన వాటిపై స్పందించి చులకన కాదల్చుకోలేదు. దగాపడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు నాకు ముఖ్యం. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే నా లక్ష్యం. పెద్ద బాధ్యత నాపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరం. పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ. ఓట్ల అవకతవకలపై దిల్లీని కూడా వదిలిపెట్టబోం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల గురించి అందరూ మాట్లాడుతున్నారని.. తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు కునే విధంగా ఉంటుందని ప్రకటించారు. అన్ని ఆలోచించి రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసారు. ఇంకా చదవండి
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న బీఆర్‌ఎస్
తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలు రోడ్లపైకి వచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ లీడర్ల అంతా తెలంగాణ పీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్‌పై గుస్స అయితున్నారు. అధికారంలోకి రాక ముందే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెడ్డుకుందని మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ కాంగ్రెస్ దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. ఇంకా చదవండి
కేసీఆర్ ఆ జీవోను వెనక్కి తీసుకోవాలన్న ఏపీ బీజేపీ
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉన్న ఓపెన్ కోటా పదిహేను శాతాన్ని రద్దు చేస్తూ... కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ వైద్య విద్యార్థులకు నష్టం కలిగేలా తెలంగాణ ప్రభుత్వం జిఓ నంబర్ 72 తీసుకువచ్చిందని.. విభజన చట్టంప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు. అందరికీ విద్య, వైద్య అంశాలలో సమాన హక్కులున్నాయన్నారు. 15 శాతం కన్వీనర్ కోటాకి నాన్ లోకల్ విద్యార్దులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చునని.. తెలంగాణాలో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో పూర్తిగా తెలంగాణా విద్యార్ధులకి అవకాశమిస్తూ ఇచ్చిన ఈ చీకటి జిఓని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా చదవండి
టీడీపీ, జనసేనతోనే బీజేపీ - ఆ కేంద్రమంత్రి తేల్చేసి వెళ్లారా?
ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజకీయాలు ఓ క్లారిటీకి రావడం లేదు. టీడీపీ ఎవరితో కలుస్తుంది.. జనసేన టీడీపీతో కలుస్తుందా లేదా ..ఇంతకీ బీజేపీ వైఖరీ ఏంటి ? అంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఓ వైపు అధికారపక్షం విపక్ష కూటమి ఏర్పడకూడదని ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు ఇతర పార్టీలు పొత్తుల చర్చలు జరుపుతున్నాయో లేదో స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో.. కేంద్ర మంత్రి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు వచ్చారు. ఏపీలో పొత్తులు ఉంటాయని.. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అయితే నారాయణ స్వామి మాటలకు అంత ప్రాధాన్యం లభించలేదు. కానీ.. అదే పొత్తు ఉంటుందన్న సంకేతాలను మెల్లగా ప్రజల్లోకి పంపారన్న అభిప్రాయం మాత్రం బలపడుతోంది. ఇంకా చదవండి
మహబూబాబాద్ కుర్రాడి మెసేజ్‌తో అమెరికన్ దర్యాప్తు సంస్థ హై అలర్ట్ - సీన్‌లోకి సీబీఐ, సీఐడీ
హైదరాబాద్ లో ఉండి చదవుకుంటూ తనకు వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న చిన్న పిల్లల ఆశ్లీల వీడియోను చూస్తున్నాడు. అది చాలదన్నట్లు మరికొన్ని గ్రూపులకు షేర్ చేస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి ఇలాగే చేస్తున్న ఓ వ్యక్తి నంబర్ ను అమెరికన్ దర్యాప్తు సంస్థ హోమ్ లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ గుర్తించింది. ఈ విషయాన్ని పలు దర్యాప్తు సంస్థల ఆధారంగా రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా చదవండి