Top 5 Headlines Today: తెలంగాణలో ఐటీ రైడ్స్ కలకలం; ఏపీలో అమిత్ షా కామెంట్స్‌పై బొత్స కీలక వ్యాఖ్యలు
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
తెలంగాణలో ఐటీ రైడ్స్ కలకలం
తెలంగాణలో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్ నేత, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయనతోపాటు బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వీళ్లిద్దరి కంపెనీల్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇంకా చదవండి
అమిత్ షా అమాయకుడు ఏదేదో మాట్లాడతాడు - విమర్శలకు బొత్స మార్క్ కౌంటర్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమాయకుడని.. ఆయన ఏదేదో మాట్లాడరని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వం కుంభకోణాల మయమని .. అమిత్ షా విశాఖలో చేసిన విమర్శలపై బొత్స స్పందించారు. అమిత్ షా అమాయకుడు ఏదేదో మాట్లాడతాడు... బీజేపీ కి ఉన్న ఓట్ బాంక్ ఎంత అని మీడియా ప్రతినిధుల్ని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు మాటల్నే అమిత్ షా మాట్లాడుతున్నారన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారని అర్ధమవుతోందన్నారు. గురివింద గింజల్లా తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలని బొత్స సూచించారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి ఏంటో బీజేపీ నేతలు పరిశీలించుకోవాలన్నారు. ప్రధానితో తమ బంధం ఎలా ఉందో అమిత్ షాతోనూ అలానే ఉందన్నారు. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువ లేవన్నారు. ఇంకా చదవండి
హైదరాబాద్ నిమ్స్‌లో నూతన భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
నిమ్స్‌లో కొత్తగా నిర్మించబోయే బ్లాక్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్లాక్‌కు దశాబ్ధి బ్లాక్ అని పేరు పెట్టారు. ఈ బ్లాక్ ఏర్పాటుతో నిమ్స్‌లో మరో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఇంకా చదవండి
డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత అరెస్ట్
సినిమా పరిశ్రమకు చెందిన మరో కీలక వ్యక్తిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన డగ్స్ వాడుతున్నట్టు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చౌదరి నుంచి కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ వాడుతున్న కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు. రజనీకాంత్ ‘కబాలి’ సినిమాకు కేపీ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంకా చదవండి
కాసేపు సెల్ఫీలు, తర్వాత వాకింగ్-యువగళంపై మంత్రి కాకాణి సెటైర్లు
నారా లోకేష్ యువగళం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించగానే స్థానిక వైసీపీ నేతలు ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు. జిల్లా మంత్రి కాకాణి యువగళంపై సెటైర్లు పేల్చారు. సోషల్ మీడియాలో యువగళం గురించి చాలా హైప్ చేశారని, కానీ నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించగానే పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. లోకేష్ యాత్రకు స్పందనే లేదని చెప్పారు. లోకేష్ తో ఎవరూ కలసి నడవడానికి ఇష్టపడలేదని చెప్పారు. అసలు లోకేష్ యాత్రలో ప్రజలు ఎందుకు పాల్గొనాలి అని ప్రశ్నించారు కాకాణి. ఇంకా చదవండి