Top 10 Headlines Today: చంద్రబాబుపై కేశినేని అసహనం, జనసేనలోకి కీలక వ్యక్తి - నేటి టాప్ 5 న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఆహ్వానం కూడా అందలేదన్నారు నాని. విజయవాడ ఆఫీస్ ఓపెనింగ్‌కి కూడా పిలవలేదన్నారు. ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌లు ఎవరు గొట్టంగాళ్లని ఎద్దేవా చేశారు. వేరే పార్టీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. తాను ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానో తనకు తెలుసు అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తాను మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నానని అన్నారు కేశినేని నాని. ప్రజలకు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తారనని ధీమా వ్యక్తం చేశారు. నీళ్ల ట్యాంకర్లను ప్రారంభించిన సందర్భంగా విజయవాడలోని తన ఆఫీస్ వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి
జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు
చీరాల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జూన్ 12న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. 14వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టనున్నారు. ఈ వారాహి యాత్రకు ముందే అంటే 12న మంగళగిరి లోని పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే పూజా సమయంలోనే జనసేన పార్టీలో చేరాలని ఆమంచి స్వాములు నిర్ణయించుకున్నారు. తర్వాత చీరాలలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకా చదవండి
నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
జూన్ 9న శుక్రవారం నుంచి మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ఈ ప్రసాదం కోసం ప్రజలు తరలి వస్తారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పంపిణీ ప్రారంభించనున్నారు. మరుసటి రోజు అంటే శనివారం ఉదయం వరకు ప్రసాదం పంపిణీ ఉంటుంది. ఇంకా చదవండి
నాడు చెరువులు నిండుకున్నాయి- నేడు నిండు కుండలు
అమృత్ సరోవర్ రూపంలో తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైందన్నారు మంత్రి కేటీఆర్. చుక్క నీరు లేక శల్యమైన చెరువులకు ప్రాణం పోసిన నాయకుడు కేసీఆర్ అంటూ ఓ కవితను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పదేళ్ల క్రితం ఎక్కడ చూసిన చెరువుల ఎండిపోయి గుండె బరువెక్కేదన్నారు. ఇప్పుడు వాటిని కల్పతరువుగా మార్చేసి కరువును దూరం చేశారన్నారు. ఇంకా చదవండి
పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్!
అధికారంలో ఉన్నామన్న కారణంగా అనుబంధసంఘాల నేతలందరూ రిలాక్స్ అయ్యారని వైసీపీ అనుబంధ సంఘాల ఇంచార్జ్ విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత పార్టీ ఆఫీసులో ఆయన అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం చూపించారని అనుబంధ సంఘాల నేతలపై విజయసాయిరెడ్డి మమండిపడ్డారు. అనుబంధ విభాగాలతో ఆయన వేర్వేరుగా సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులకు విజయ సాయి స్పష్టం చేశారు. పార్టీ అనుబంధ విభాగాలైన మహిళ,యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులతో విడివిడిగా విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఇంకా చదవండి