News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

నాడు చెరువులు నిండుకున్నాయి- నేడు నిండు కుండల్లా ఉన్నాయి: తెలంగాణ మంత్రులు

తెలంగాణ దశాబ్ధ ఉత్సవాల్లో భాగంగా నేడు చెరువుల పండుగ నిర్వహిస్తున్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను బాగు చేసి దేశానికే కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని మంత్రులు ప్రశంసలు.

FOLLOW US: 
Share:

అమృత్‌ సరోవర్‌ రూపంలో తెలంగాణ మోడల్‌ దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైందన్నారు మంత్రి కేటీఆర్. చుక్క నీరు లేక శల్యమైన చెరువులకు ప్రాణం పోసిన నాయకుడు కేసీఆర్ అంటూ ఓ కవితను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పదేళ్ల క్రితం ఎక్కడ చూసిన చెరువుల ఎండిపోయి గుండె బరువెక్కేదన్నారు. ఇప్పుడు వాటిని కల్పతరువుగా మార్చేసి కరువును దూరం చేశారన్నారు. 

ఆయన ఏమన్నారంటే.... పదేళ్ల క్రితం...  
ఏ చెరువును చూసినా గుండెబరువు
వాటిపై ఆధారపడిన కులవృత్తులకు లేదు బతుకుదెరువు
కానీ..
దశాబ్ది ఉత్సవాల వేళ ప్రతి చెరువు... 
కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువు

చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మలాంటి ఊరి చెరువుకు 
ఊపిరిపోసిన నాయకుడు...

గొలుసుకట్టు చెరువుల గోస తీర్చిన పాలకుడు...
ముఖ్యమంత్రి కేసిఆర్ గారు...

చెరువులకు పట్టిన దశాబ్దాల శిలుమును 
వదిలించిన విప్లవం పేరే.. మిషన్ కాకతీయ

"వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా"  మెచ్చిన పథకమిది
"మిచిగాన్ యూనివర్సిటీ"కి నచ్చిన పథకమిది

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసిన తరుణమిది
పొలిమేరల్లో ఉన్న చెరువును ప్రతి గుండెకు చేరువ చేసిన చరిత్ర ఇది.

అమృతోత్సవ వేళ మన మిషన్ కాకతీయ 
దేశానికే ఆదర్శమైంది..
“తెలంగాణ మోడల్” “అమృత్‌ సరోవర్‌” రూపంలో 
దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైంది. 

మండువేసవిలో మత్తడి దుంకుతున్న చెరువుల సాక్షిగా...
ఈ మహాయజ్ఞంలో మనసుపెట్టి పనిచేసిన ప్రతిఒక్కరికి... 
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చెరువుల పండుగ శుభాకాంక్షలు చెప్పారు కేటీఆర్. 

మరో మంత్రి హరీష్‌రావు కూడా చెరువుల పండుగ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు ఎండిపోయిన చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు కళకళలాడుతున్నాయని తెలిపారు. 

ఆయన ఇంకా ఏమన్నారంటే... "నాడు ఎండి పోయిన చెరువులు.. నేడు నిండు కుండల్లా చెరువులు.. నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం.. నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునర్జీవం. అందుకే మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం అయ్యింది. అమృత్ సరోవర్‌గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది"  

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు చెరువుల పండుగ నిర్వహిస్తున్నారు. మిషన్ కాకతీయలో బాగుపడిన చెరువుల వద్ద సంబరాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేతలు మిషన్ కాకతీయ విజయాలను గుర్తు చేస్తూ ట్వీట్‌లు చేశారు. మరికొందరు ప్రెస్‌మీట్‌లు పెట్టారు.  

Published at : 08 Jun 2023 11:41 AM (IST) Tags: KTR BRS KCR Harish Rao Decade Celebrations Mission Kakatiya

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: శోభాయమానంగా ఖైరతాబాద్‌ గణేషుడి యాత్ర

Breaking News Live Telugu Updates: శోభాయమానంగా ఖైరతాబాద్‌ గణేషుడి యాత్ర

రెవెన్యూ డివిజన్‌గా చండూరు, మండలం కేంద్రం మహ్మద్ నగర్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రెవెన్యూ డివిజన్‌గా చండూరు, మండలం కేంద్రం మహ్మద్ నగర్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

Hyderabad Traffic Restrictions: గురువారం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం, ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

Hyderabad Traffic Restrictions: గురువారం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం, ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

టాప్ స్టోరీస్

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి