TMC MP : తల్లయిన తృణమూల్ ఎంపీ నుస్రత్ .. ఆమె లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులో..!
నిఖిల్ జైన్‌ని టర్కీలో పెళ్లి చేసుకున్న ఎంపీ నుస్రత్ ఆ తర్వాత ఆ పెళ్లి చెల్లదన్నారు. ఓ బెంగాలీ బీజేపీ నేతతో సహజీవనం చేసి బిడ్డను కన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ పండంటి మగబిడ్డకు జన‍్మనిచ్చారు. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మాములుగా అయితే ఇది పెద్ద విషయం కాదు కానీ నుస్రత్ జహాన్ లవ్ స్టోరీ.. ఆమె బిడ్డకు తండ్రి ఎవరు అన్న విషయంలో మాత్రం ట్విస్టులు ఉన్నాయి. నుస్రత్ జహాన్ ప్రముఖ బెంగాలీ నటి. రాజకీయాల్లోకి వచ్చారు. తృణమూల్ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆమె టర్కీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. కోల్‌కతాకే చెందిన నితిన్ జైన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అప్పట్లో ఆమె పెళ్లి వార్త హాట్ టాపిక్ అయింది. ఎంతైనా తృణమూల్ ఎంపీ.. సినీ నటికాబట్టి మీడియాలో బాగా హైలెట్ అయింది. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది.
జూన్ ప్రారంభంలో ఆమె ఆరు నెలల గర్భవతిగా తేలింది. అనూహ్యంగా ఆమె భర్త నిఖిల్ జైన్ నుస్రత్ జహాన్ గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తనకు సంబంధం లేదని ప్రకటించారు. ఆరు నెలల నుంచి తాము దూరంగా ఉన్నామని సంసారం చేయలేదని స్పష్టం చేశారు. మామూలుగా భర్త ఇలాంటి ప్రకటన చేస్తే సమాజం అతన్ని అదోలా చూస్తుంది. కానీ అక్కడ నిఖిల్ జైన్‌కు తప్పలేదు. అలాగే ఆ విషయంలో నిఖిల్‌కు సంబంధం లేదని.. ఆయనేమీ చేయలేదని నుస్రత్ జహాన్ కూడా స్పష్టం చేసింది. అయితే నేరుగా చెప్పకుండా నిఖిల్‌జైన్‌తో టర్కీలో జరిగిన తన పెళ్లి చెల్లదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. తమ పెళ్లికి చట్టబద్ధత లేదని నుస్రత్ జహాన్ ప్రకటించారు. నిఖిల్ జైన్‌తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని ఈ పెళ్లి భారత్‌లో చెల్లదని స్పష్టం చేసింది. అందువల్ల విడాకుల ప్రస్తావన కూడా రాదని ఆమె డిక్లేర్ చేశారు. అదే సమయంలో నిఖిల్ జైన్ తన ఆస్తులు, డబ్బులు లాక్కున్నారని ఆరోపించారు. ఆ వివాదం అప్పటితో ముగిసిపోయింది.
ఇప్పుడు ఆమె పండంటి బిడ్డను జన్మనిచ్చారు. మరి ఆ బిడ్డకు తండ్రెవరు..? నిఖిల్ జైన్‌తో దూరంగా ఉండటానికి కారణం ఓ బీజేపీ నాయకుడు.. నటుడు. ఆయన పేరు యష్ దాస్ గుప్తా. నుస్రత్ జహాన్ గర్భానికి కారణం యష్ దాస్ గుప్తానే అని అప్పట్లోనే జోరుగా ప్రచారం జరుగింది. ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. నుస్రత్ జహాన్.. చాలా కాలంగా యష్ దాస్ గుప్తాతో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ జోడీగా ఎస్ఓఎస్ 2020 అనే బెంగాలీ సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆమెకు డెలివరీ కోసం ఆస్పత్రిలో చేర్చింది కూడా యష్ దాస్ గుప్తానే. డెలివరీ తర్వాత మగ బిడ్డ పుట్టాడని ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పింది కూడా యష్ దాస్ గుప్తానే.
ఇది పూర్తిగా నుస్రత్ జహాన్ వ్యక్తిగతమే అయినప్పటికీ సినీ, రాజకీయ సెలబ్రిటీ కావడంతో..అందరికీ కావాల్సిన అంశంగా మారిపోయింది. తమ మధ్య విభేదాలు ఉండవచ్చు కానీ అంటూ తల్లీ బిడ్డలిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు నిఖిల్ జైన్. ఎంతైనా సినీ నటి అయిన ఎంపీ.. బెంగాల్‌లో తన బద్ద శత్రువు పార్టీ నేతతో పెళ్లి కాకుండానే తల్లయ్యారన్నమాట.