అన్వేషించండి

Tirumala News: మూలవిరాట్‌ను కూడా చిత్రీకరించారేమో? ఫోన్‌తో వచ్చిన వ్యక్తిపై టీటీడీ అనుమానం- పోలీసులకు ఫిర్యాదు

Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయానికి సెల్ ఫోన్ తో వచ్చి ఆలయాన్ని ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తిపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయమై సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Tirumala News: తిరుమల తిరుపతి దేవస్ధానంలో భధ్రతా గాలిలో దీపం వెలిగించినట్లు రీతిలో తయారైనట్లు మరోమారు వెల్లడైంది. నాలుగంచెల భధ్రత కలిగి, అనుక్షణం సీసీ కెమెరాల నిఘా నేత్రంలో ఉండే తిరుమల పుణ్యక్షేత్రంలో ఓ భక్తుడు సెల్ ఫోన్ తో ఆలయంలోకి ప్రవేశించి ఆనంద నిలయాన్ని చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మరోసారి ఏడు కొండలపై భధ్రతా సిబ్బంది వైఫల్యం బహిర్గతంమైందని స్పష్టంగా తెలుస్తోంది. తిరుమల పుణ్యక్షేత్రానికి ముష్కరుల నుంచి ముప్పు పొంచి‌ ఉందని, కేంద్ర నిఘా సంస్ధలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నా, భధ్రతా సిబ్బంది భద్రతా సిబ్బంది‌ మాత్రం‌ నిమ్మకు‌ నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 

ఆక్టోపల్ బలగాలో పాటు ఇతర సిబ్బంది నిఘా

కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నిత్యం వేలాది మంది భక్తులతో‌ కిటకిట‌లాడుతూ ఉంటుంది. దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుండడంతో తిరుమల పుణ్యక్షేత్రం ముష్కరుల‌ జాబితాలోకి చేరింది. ఐతే ఏడు కొండలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి‌ ఉందని ఇప్పటికే‌ కేంద్ర ఇంటెలిజేన్స్ వర్గాలు హెచ్చరికల జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో‌నే తిరుమల పుణ్యక్షేత్రం భధ్రతపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించిన‌ విషయం తెలిసిందే.‌ ఇందులో‌ భాగంగా తిరుమల భద్రతకు  ప్రత్యేకంగా ఆక్టోపస్ బలగాలను కేటాయించడంతో పాటుగా, టీటీడీ భధ్రతా వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్పీఎఫ్, అర్ముడ్ రిజర్వ్, హోంగార్డు, ప్రైవేట్ సెక్యూరిటీ తిరుమల భధ్రతను పర్యవేక్షణలో ఉంటుంది. ఇలా వివిధ  భధ్రత విభాగాలకు చెందిన దాదాపు 2000 మంది భద్రతా సిబ్బంది నిరంతరం తిరుమలలో పహారా కాస్తుంటారు. వీరికి తోడుగా తిరుమల మొత్తం కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. తిరుమల మహా ద్వారంగా పిలుచుకునే అలిపిరి మొదలుకొని తిరుమల మొత్తం కూడా దాదాపుగా 2000కు పైగా సీసీ కెమెరాలని టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ సీసీ కెమెరాలను అనునిత్యం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. ఈ కమాండ్ కంట్రోల్ రూంలో ఉన్న సిబ్బంది రౌండ్ ది క్లాక్ నిఘా నేత్రంలో ఉన్న తిరుమల కొండ భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఎక్కడైనా ఏదైనా దొంగతం జరిగినా, లేక అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించినా నిమిషాల్లో ఆ ప్రాంతాల్లో విధుల్లో ఉన్న భధ్రతా సిబ్బందిని అలెర్ట్ చేస్తుంటారు. దీంతో‌ తిరుమలలో‌ ఎటువంటి అవాంఛనీయ ‌ఘటనలు చోటు చేసుకోకుండా‌ ముందే పసికట్టి చర్యలు చేపడుతూ ఉంటారు.

వైకుంఠం క్యూకాంప్లెక్స్ ప్రధానమైంది...!

ఎన్నో వ్యయ‌ ప్రాయాసలకు లోనై ఏడు కొండలకు చేరుకున్న భక్తులు క్షణ కాలం పాటు‌‌ జరిగే శ్రీనివాసుడి దర్శనం కోసం‌ పరితపించిపోతుంటారు. ముందుగా భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్సులోకి ప్రవేశిస్తూ‌ ఉంటారు. అయితే తిరుమలలోని అతి ముఖ్య ప్రాంతాల్లో వైకుంఠం క్యూ‌ కాంప్లెక్స్ ప్రధానమైనది. ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్సులో శ్రీవారి ఆలయం లోపల భద్రతను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ సిబ్బంది నిర్వహిస్తారు. ఎక్కడా లేనంత విధంగా తిరుమల కొండపై కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ నిఘాలో ఉన్నా, గత కొద్దీ రోజులుగా తిరుమల కొండపై జరుగుతున్న ఘటనలు తిరుమల భద్రతా వ్యవస్థలోని వైఫల్యాలను బట్ట బయలు చేస్తుంది. గత కొద్ది‌ రోజుల‌ క్రితం శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి‌ పడిన టీటీడీ‌ భధ్రతా సిబ్బంది డ్రోన్ కెమెరాలో శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించిన వ్యక్తి పట్టుకుని కేసు నమోదు చేశారు. అయితే తిరుమలలో‌ గ్యాస్ పైప్ లైన్ కోసం డ్రోన్ కెమెరాతో నిర్వహించిన సర్వేలో శ్రీవారి ఆలయంను సైతం డ్రోన్ కెమెరాలో చిత్రీకరించినట్లు టీటీడీ ప్రకటన విడుదల చేయడంతో పాటుగా సొషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించింది. 

తాజాగా గత నెల 30వ తేదీన ఉగ్రవాదుల నుంచి ముప్పు‌ ఉందని,‌ సులభా కార్మికుల రూపంలో తిరుమల పుణ్య క్షేత్రంలో ఉగ్రవాదులు ప్రవేశించారని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డికి మెయిల్ రావడంతో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం తిరుమల‌ కొండతో పాటుగా, తిరుపతి, అలిపిరి‌ ప్రాంతాలను‌ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఈ మెయిల్ ఫేక్ అని తెలియడంతో జిల్లా‌ పోలీసు యంత్రాంగం ఊపిరి‌ పీల్చుకుంది. ఫేస్ మెయిల్ పంపిన వారి కోసం జిల్లా పోలీసు‌ బృందం కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ ఘటన మరువక ముందే శ్రీవారి ఆలయంలోనికి టీటీడీ విజిలెన్స్ అధికారులు కన్నుగప్పి గుర్తు తెలియని వ్యక్తి శ్రీవారి ఆలయంలోనికి సెల్ ఫోన్ తో ప్రవేశించి.. చిత్రీకరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భధ్రత నడుమ ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్సులో మూడు అంచెల భధ్రతా సిబ్బంది‌‌ కలిగి ఉంటుంది. శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే భక్తుడు ముందుగా క్యూకాంప్లెక్సులోనికి ప్రవేశించే సమయంలో, కంపార్టుమెంట్ నుంచి ఆలయానికి వెళ్లే సమయంలో, చివరిగా మహాద్వారంకి సమీపంలో భక్తులను క్షుణ్ణంగా తనీఖీ చేసిన తర్వాత ఆలయంలోనికి అనుమతిస్తారు. 

విజిలెన్స్ అధికారుల కళ్లుగప్పి ఫోన్ తో లోపలికెళ్లిన భక్తుడు..!

సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల బ్యాగులను తనిఖీ చేసేందుకు వైకుంఠం క్యూకాంప్లెక్సులోని కంపార్టుమెంట్ లో‌ అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్కానర్ల ద్వారా భధ్రతా సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. ఎటువంటి నిషేధిత వస్తువునైనా గుర్తించి.. వెంటనే అప్రమత్తం అవుతారు. మరోవైపు శ్రీవారి ఆలయంలో వందల సంఖ్యలో సీసీ కెమెరాలతో నిఘా పర్యవేక్షణ ఉంటుంది. ఇంతటి‌ నిఘాలో సైతం ఈ నెల 7వ తేదీన రాత్రి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారం నుంచి విమాన ప్రాకారం వెళ్లే మార్గంలో ఆనంద నిలయాన్ని ఓ భక్తుడు చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్వామి వారి దర్శనాంతరం బంగారు వాకిలి దాటిన వెంటనే వకుళమాత ఆలయానికి బయట ప్రాంతంలో నిలబడి ఆనంద నిలయాని సెల్ ఫోన్ తో చిత్రీకరించాడు. ఆ తర్వాత విమాన వెంకటేశ్వర స్వామికి సమీపంలోని మండపం వద్ద నుంచి కూడా ఆనంద నిలయాన్ని మొబైల్ ఫోన్ తో చిత్రీకరించాడు. ‌వీటితో పాటు ఆ భక్తుడు శ్రీవారి ఆలయంలోని పలు ఉప ఆలయాలు, క్యూలైన్లను సెల్ ఫోన్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. శ్రీవారి ఆనంద నిలయాన్ని సెల్ ఫోన్ తో చిత్రీకరించిన భక్తుడు.. స్వామి వారి దర్శనానికి వెళ్లిన సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్ ని సైతం సెల్ ఫోన్ లో చిత్రీకరించాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంపై అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు సెల్ ఫోన్ లో ఆనంద నిలయంను చిత్రీకరించిన వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు.

కేసు నమోదు చేసి సీసీటీవీ పరిశీలిస్తున్న పోలీసులు

ఈ క్రమంలోనే శ్రీవారి ఆలయంలో విడియో చిత్రీకరణ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలు, ఫొటోలు తీసిన వ్యక్తిని కనుక్కునేందుకు పోలీసులు నిన్నటి నుండి సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. మొన్న బారీ వర్షం కురవడంతో 9 సీసీ కెమెరాలు పని చేయలేదట. ఈ క్రమంలోనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించేందుకు పోలీసులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ తో విడియో తీసారా, లేదా నిఘా కెమరాతో తీసారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అలాగే విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై టీటీడీ చర్యలు తీసుకోనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Ashutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget