Breaking News Telugu Live Updates: కేసీఆర్‌తో ముగిసిన ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
CM Jagan News: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి – ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు బాలసాకేత్ రెడ్డి – మహిమల వివాహం ఇటీవల హైదరాబాద్ లోని ఫిలింనగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ హాజరు కాలేదు. అక్కడ విజయమ్మ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా కావలిలో బాలసాకేత్ రెడ్డి -మహిమ ల వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం ఆల్రడీ మంత్రుల బృందం నెల్లూరులోనే మకాం వేసింది. వీరంతా రిసెప్షన్ కు హాజరయ్యారు. వేదికమీద నూతన దంపతులను సీఎం జగన్ ఆశీర్వదంచారు. కావలిలోని ఆర్ఎస్ఆర్ విద్యాసంస్థల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
KCR Undavalli Arun Kumar Meeting: కేసీఆర్‌తో ముగిసిన ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే వీరిద్దరి భేటీ ముగిసింది. అంతకుముందు కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఇలా ప్రముఖులతో కేసీఆర్ వరుసగా భేటీ అవుతుండడం చర్చనీయాంశం అయింది. సీఎం జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
KCR PK Meet: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ - పీకే చర్చలు
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. మూడు గంటలుగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు. జాతీయ పార్టీ ప్రకటన, ఎన్నికలు, సర్వే తదితర కీలక అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు సమాచారం.
Payal Rajputh in Tirupati: తిరుపతిలో పాయల్ రాజ్ పుత్ సందడి
ప్రముఖ సినీ తార పాయల్ రాజ్ ఫుత్ తిరుపతిలో సందడి చేసింది. తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిలోని రామానుజపల్లి వద్ద హోటల్ ద్వారకా ఇన్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది. రిబ్బన్ కట్ చేసి హోటల్ ను ప్రారంభించింది. హోటల్
ప్రారంభోత్సవంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని అన్నారు పాయల్ రాజ్ ఫుత్. హోటల్ ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడిన పాయల్. సక్సెస్ అనేది మన సొంతం అయితే మనమే ఆ సక్సెస్ కు డెఫినిషన్ అవుతామని అన్నారు. హోటల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవాలని కోరుకున్నట్లు తెలిపారు. త్వరలోనే నాలుగు సినిమాలు విడుదల కానున్నాయని, అందులో రెండు ఫ్యాన్ ఇండియా సినిమాలని చెప్పారు. నిరంతరాయంగా ఆరు నుంచి ఏడు సినిమాల్లో నటించడంతో చాలా బిజీగా ఉన్నానని అన్నారు. మంచు విష్ణు జిన్నా మూవీలను, జయరాజ్ బయోపిక్ లోనూ నటిస్తున్నట్లు పాయల్ రాజపుత్ పేర్కొన్నారు.
Tirumala News: టీటీడీ ట్రస్టులకు రూ.3.20 కోట్లు విరాళం..
తిరుపతి: టీటీడీలోని ట్రస్టులకు వివిధ సంస్థల నుండి రూ.3.20 కోట్లు ఆదివారం ఉదయం విరాళంగా అందింది.. హైదరాబాదుకు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ గ్రూప్స్ సంస్థ యాజమాన్యం వెంకటేశ్వర్లు,ప్రసాదరావు,రాజమౌళి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.1.20 కోట్లు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు అందించారు.. అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన హానర్ హోమ్స్ సంస్థ యాజమాన్యం బాలచంద్ర, స్వప్న కుమార్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు సంబంధిత డీడీలను అందజేశారు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

