అన్వేషించండి

Tirumala News: శుక్రవారం నాడు శ్రీ వేంకటేశ్వరుడికి ఏఏ ప్రసాదం నివేదిస్తారంటే?

Tirumala News: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నవంబర్ 18వ తేదీ ఒక్కరోజే 65 వేల 62 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 4.04 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

Tirumala News: తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాలను తయారు చేసి నివేదిస్తుంటారు. గురువారం 17వ తేదీ నవంబర్ రోజున 65, 062 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 25,761 మంది తలనీలాలు సమర్పించగా, 4.04 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 23 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వ దర్శనానికు 20 గంటల సమయం‌ పడుతుంది.‌ ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.‌ అటుతరువాత  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాస మూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో "బెల్లం పూర్ణం బోండాలు, పోలీల" శుక్రవారం ప్రత్యేకంగా నివేదిస్తారు. ఇక వీటితో పాటుగా అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. అటు తరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్ర దీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యంమామునూర్‌లో పోలీసులపై పోలీస్ కుటుంబాల నిరసనబ్రిక్స్ సమ్మిట్‌లో జోక్ వేసిన పుతిన్, పగలబడి నవ్విన మోదీసీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ABP Southern Rising Summit 2024 : సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
KTR News: కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
Vasireddy Padma : జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
Embed widget