అన్వేషించండి

Tipu Sultan Sword Auction: రూ.140 కోట్లు పలికిన టిప్పు సుల్తాన్ ఖడ్గం, లండన్‌లో వేలంపాట

Tipu Sultan Sword Auction: లండన్‌లోని వేలం పాటలో టిప్పు సుల్తాన్ ఖడ్గం రూ.140 కోట్ల విలువ పలికింది.

Tipu Sultan Sword Auction:

లండన్‌లో వేలం..

18వ శతాబ్దంలో మైసూర్‌ని ఏలిన టిప్పు సుల్తాన్‌ ఖడ్గం లండన్‌లో వేలం వేయగా...రూ.140 కోట్లకు అమ్ముడుపోయింది. Auction House Bonhams ఈ ఆక్షన్‌ని ఆర్గనైజ్ చేసింది. అంచనా వేసిన దానికంటే 7 రెట్లు ఎక్కువ మొత్తానికే అమ్ముడుపోయినట్టు ఆ కంపెనీ వెల్లడించింది. ఇది టిప్పు సుల్తాన్‌కి బాగా నచ్చిన ఖడ్గమని, ఆయన వాడిన ఆయుధాల్లో ఇది అత్యంత కీలకమైందని స్పష్టం చేసింది. 18వ శతాబ్దంలో జరిగిన యుద్ధాలన్నింటినీ వరుసగా గెలిచి చరిత్ర సృష్టించాడు టిప్పు సుల్తాన్. 1175 నుంచి 1779 వరకూ మరాఠాలపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధాల్లో ఈ ఖడ్గాన్ని వాడినట్టు చెబుతోంది బోన్‌హమ్స్‌ సంస్థ. 

"ఈ అత్యద్భుతమైన ఖడ్గం ఇన్నాళ్లు ప్రైవేట్ సంస్థల అధీనంలో ఉంది. టిప్పు సుల్తాన్ వాడిన ఆయుధాల్లో ఇది చాలా కీలకమైంది. దీన్ని క్యాప్చర్ చేసినప్పటి నుంచి జాగ్రత్తగా కాపాడుతూ వచ్చారు. చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకూ అత్యంత అద్భుతంగా తయారైన ఖడ్గాల్లో ఇది ఒకటి. అందుకే దీనికి అంత డిమాండ్ వచ్చింది. ఈ ఖడ్గానికి గొప్ప చరిత్ర ఉంది. ఇద్దరు బిడ్డర్స్‌ పోటాపోటీగా వేలం పాట పాడారు. చివరికి అది రూ.140 కోట్ల దగ్గర ఫైనలైజ్ అయింది"

- ఆక్షన్ నిర్వాహకులు 

టిప్పు సుల్తాన్‌ ప్యాలెస్‌కి సంబంధించిన ఓ ప్రైవేట్ క్వార్టర్స్‌లో ఈ ఖడ్గాన్ని గుర్తించి భద్రపరిచారు. టిప్పు సుల్తాన్‌కి టైగర్ ఆఫ్ మైసూర్‌గా పేరుంది. మైసూర్‌ ఎకానమీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే..టిప్పు సుల్తాన్‌ హత్యకు గురైన తరవాత ఆయన ఖడ్గాన్ని బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బెయిర్డ్‌గి అప్పగించారు. ఆక్షన్ హౌజ్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 

క్వీన్ ఎలిజబెత్‌ టీ బ్యాగ్ వేలం..

బ్రిటన్ ను సుదీర్ఘకాలం పాటు పాలించిన క్వీన్ ఎలిజబెత్- 2 గతేడాది సెప్టెంబర్‌లో 96 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె మరణించిన తర్వాత కొద్ది సమయంలోనే ఆమె ఉపయాగించిన వస్తువులు ఆన్ లైన్ లో అమ్మకానికి వచ్చాయి. ఇందులో రాణి 1998లో ఉపయోగించిన టీ బ్యాగ్ నమ్మశక్యం కాని ధరకు అమ్ముడైంది. బ్రిటన్ రాణి దివంగత క్వీన్ ఎలిజబెత్- 2 ఉపయోగించిన వస్తువులు ఆన్ లైన్ వేలంలో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఆమె 1998లో ఉపయోగించిన టీ బ్యాగ్ ఒకటి 12 వేల డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే భారత కరెన్సీలో అక్షరాల 9.5 లక్షల రూపాయలు. ఇది ఈబేలో వేలానికి ఉంచగా రికార్డు ధరకు అమ్ముడుపోయింది.  ఈ టీ బ్యాగ్ కు రాయల్ ఫ్యామిలీ ప్రామాణికత సర్టిఫికెట్ ఉందని అమ్మకందారులు తెలిపారు. అలాగే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికెట్స్ ఇచ్చిన సర్టిఫికెట్ ను దీనికి జోడించారు. ఇది ఒక టీ బ్యాగ్. చరిత్రలోని ఒక ముఖ్యమైన దాన్ని సొంతం చేసుకోండి. ఇది వెలకట్టలేనిది అని లిస్టింగ్ లో పేర్కొన్నారు. 

Also Read: Sengol in Parliament: పార్లమెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సెంగోల్, ఏంటీ దీని కథ - ఎందుకంత ప్రత్యేకం?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | సంచలన ఛేజింగ్ తో పిచ్చెక్కించిన పంజాబ్ | IPL 2024| ABP DesamBoy Rescued 50 Members in Fire Accident | అగ్నిప్రమాదం నుంచి 50 మందిని కాపాడిన బాలుడు | ABP DesamFire Accident in Alwin Pharmacy Company Rangareddy | రంగారెడ్డిలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం | ABP DesamJamie Lever Interview | Allari Naresh | Aa Okkati Adakku |ఈ వీడియో చూస్తే నవ్వాగదు..

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Anupama Parameswaran: అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
Warangal News: ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
Embed widget