JK Encounter: జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్ అవంతిపొరాలో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ ముగ్గురు జైషే మహ్మద్ కు చెందినవారుగా గుర్తించారు అధికారులు.
ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. జమ్ముకశ్మీర్ అంవతిపొరాలోని త్రాల్ లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. వీరంతా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. వీరి వద్ద నుంచి రెండు ఏకే-47 రైఫిల్స్, ఒక ఎస్ఎల్ఆర్ సహా మరి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Jammu & Kashmir | Two AK-47 rifles, one SLR and other warlike stores have been recovered from the three terrorists neutralised in the Tral encounter. The identity of the terrorists is being ascertained: PRO (Defence) Srinagar
— ANI (@ANI) August 21, 2021
Srinagar | We came to know that the 3 terrorists were operating in the area for a long time. Their elimination has sent a strong message that there is no place for them in the Valley: Maj Gen Rashim Bali (GOC Victor force) on 3 terrorists killed in Tral encounter pic.twitter.com/4QQ13HcBzN
— ANI (@ANI) August 21, 2021
త్రాల్ లోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతాన్ని అంతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి.
శుక్రవారం ఉదయం ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టిన తర్వాత నేడు ఉదయం ఈ ఘటన జరిగింది. కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. ఉగ్రవాదుల ఏరివేత చేపడుతోంది. ఉగ్రవాదులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భద్రతా దళాలు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి.