Top Headlines Today: సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు - BRS ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారా ? - నేటి టాప్ న్యూస్
AP Telangana Latest News 21 June 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
Andhra Pradesh News Today - ముఖ్యమంత్రిగా వస్తా అన్నారు- అఖండ మెజార్టీతో వచ్చారు- సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు
చంద్రబాబు అన్న మాటను నిలబెట్టుకున్నారు. అయిదేళ్ల క్రితం 23 స్థానాలకే పరిమితమైన స్థాయి నుంచి.. అసెంబ్లీలో వ్యక్తిత్వ హననం, తన కుటుంబ సభ్యులకు జరిగిన అవమానం, అధికార పక్ష సభ్యుల వ్యక్తిగత ధూషణల నేపథ్యంలో ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, తిరిగి ఈ సభకు ముఖ్యమంత్రిగానే వస్తానని సవాలు చేసిన చంద్రబాబు రెండున్నరేళ్లు తిరిగేసరికీ అన్నంత పనీ చేశారు. నిజానికి అంతకు మించే చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బీజేపీతో టచ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి - ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు
బీజేపీలో చేరేందుకు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మీడియాకు చెప్పారు. ఇప్పటికే మిథున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని ప్రకటించారు. వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కన్పిస్తోందని స్వయంగా మిధున్ రెడ్డి కూడా బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కొడాలి నానిపై కేసు నమోదు - ఫిర్యాదు చేసిన వాలంటీర్లు
గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు నమోదు అయింది. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మాజీ వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447,506,R/w34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం- రైతులకు మేలు జరుగుతుందని కామెంట్స్
మాజీ స్పీకర్, బీఆర్‌ఎస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతోపాటు కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లు పూర్తైన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జరుగుతున్న పరిణామాలూ చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. రేవంత్ రెడ్డినే తానే ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సంక్షోభం అంచున బీఆర్ఎస్ - ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారా ?
భారత రాష్ట్ర సమితిలో అంతర్గతంగా అలజడి రేగుతోంది. ఊహించని విధంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పడిపోయింది. ఆయన ఇంటి మందు ధర్నా చేసేందుకు బాల్క సుమన్ నేతృత్వంలో కొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కానీ ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే.. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ... కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి