Viral News : ఆంధ్రా తల్లికి పాకిస్తాన్ బిడ్డ - గల్ఫ్‌లో సినిమాల్లో కూడా ఇప్పటి వరకూ చూడని వింత గాథ !
Gulf Story: గల్ఫ్ లో తెలుగు దంపతులకు ఓ విచిత్రమైన కష్టం వచ్చింది. వారి బిడ్డకు తానే తండ్రినని ఓ పాకిస్తాన్ యువకుడు వచ్చాడు. డీఎన్‌ఏ కూడా సరిపోలింది. ఇప్పుడు ఏం చేయాలి?

Gulf News: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులు బతుకు దెరువు కోసం గల్ఫ్ వెళ్లారు. అక్కడికి వెళ్లే సరికి వారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. గల్ఫ్ లో మూడో బిడ్డకు జన్మనిచ్చారు. కష్టపడి అంతా బతుకుతున్న సమయంలో ఆ కుటుంబంలో ఓ సుడిగుండం వచ్చి పడింది. అదేమిటంటే..వారి మూడో బిడ్డకు తండ్రి తానేనని ఓ పాకిస్తాన్ యువకుడు రావడం.
ఆ యువకుడు ఆషామాషీగా రాలేదు. నేరుగా గల్ఫ్ లో అధికారిక ప్రక్రియ ద్వారా తన బిడ్డ ను క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చాడు. డీఎన్‌ఎ టెస్టులు కూడా చేయించారు అధికారులు. చివరికి ఆ బిడ్డకు తండ్రి దంపతుల్లోని భర్త కాదని.. పాకిస్తాన్ యువకుడేనని తేలింది.
ఆంధ్రా దంపతులు గల్ఫ్ వెళ్లిన తర్వాత అక్కడ వారికి పాకిస్తాన్ యువకుడు పరిచయమయ్యాడు. వారితో కలుపుగోలుగా ఉన్నాడు. ఆ సమయంలో ఆ దంపతుల్లో భార్యకు..ఆ పాకిస్తాన్ యువకుడికి వివాహేతర బంధం ఏర్పడి ఉంటుందని ఈ క్రమంలో బిడ్డను కన్నారని అర్థం అవుతుంది. అయితే ఈ విషయం డీఎన్ఏ టెస్టు చేసే వరకూ బయటకు రాలేదు.
ఆ బిడ్డకు తండ్రి ఆ పాకిస్తాన్ యువకుుడ కావొచ్చేమో కానీ తల్లిని మాత్రం తాననేని నవమాసాలు మోసాను కాబట్టి హక్కు తనకు ఉంటుందని తాను మాత్రం బిడ్డను ఇచ్చేది లేదని అంటోంది.
ఇప్పుడు ఆ యువకుడు ఎందుకు బిడ్డను కావాలంటున్నాడంటే.. తాను ముస్లింనని..తన బిడ్డను ముస్లింలాగే పెంచాలని అంటున్నాడు. కానీ ఆంధ్రా జంట హిందువులు. తమ బిడ్డను హిందువులాగే పెంచాతామని పాకిస్తాన్ యువకుడికి ఆ హక్కు లేదని వాదిస్తున్నారు.
పాకిస్తాన్ యువకుడు తన బిడ్డ అని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడే ఆ దంపతులు పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చేయాలని అనుకున్నారు కానీ.. వారు దేశం విడిచి వెళ్లకుండా ఆ పాకిస్తాన్ యువకుడు ఫిర్యాదు పెట్టాడు. అదే సమయంలో ఆ భర్తకు ఉద్యోగ సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలతో వారు అక్కడే చిక్కుకుపోయారు.
ఇప్పుడు గల్ఫ్ చట్టాలు ఏం చెబుతాయి.. వారి సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందన్నది చర్చనీయాంశమగా మారిందని ఓ తెలుగు దినపత్రిక చెప్పింది. ఆ దంపతుల ఎవరో వారి ప్రైవసీ కోసం పేర్లు బయట పెట్టలేదు.
గల్ఫ్ లో జరిగిన ఈ ఘటనలో ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అన్నది పాయింట్ కాదు.. ఆ బిడ్డను ఏ మతం ప్రకారం పెంచాలన్నది ఇప్పుడు చాయిస్ గా మారింది. తన బిడ్డ కాబట్టి ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం పెంచుతానని యువకుడు అంటున్నాడు. కానీ హిందవుగానే పెంచుతానని తల్లి అంటోంది.





















