అన్వేషించండి

TGSRTC Rakhi Delivery : రాఖీ రోజు తోబుట్టువులకు రాఖీ, స్వీట్స్ చేరేలా డెలివరీ - తెలంగాణ ఆర్టీసీ కొత్త స్కీమ్

Telangana : దూరంగా ఉన్న తోబుట్టువులకు రాఖీ రోజే రాఖీ, స్వీట్స్ అందించేలా డెలివరీ ఆప్షన్ తెలంగాణ ఆర్టీసీ ప్రారంభిస్తోంది. 19వ తేదీన ఇలా మూడు పొరుగు రాష్ట్రాల్లోనూ డెలివరీ చేయనుంది.

Telangana RTC  Rakhi Delivery : రాఖీ పండుగ వస్తే అన్న, తమ్ముళ్లకు రాఖీలు కట్టే అక్క చెల్లెళ్లకు పండుగే. అయితే ఇంటికి దూరంగా ఉండేవారు.. ఆ రోజు సోదరుల వద్దకు వెళ్లడం అంత తేలికగా అయ్యే పని కాదు. అందుకే ఎక్కువ మంది కొరియర్ సర్వీసుల్ని బుక్ చేసుకుంటారు. కొంత మంది ఆన్ లైన్ లో బుక్ చేస్తూంటారు. కానీ అవి సరిగ్గా రాఖీ రోజే చేరుతాయన్న నమ్మకం లేదు. ఆ రోజు చేరితోనే సోదరీమణులకు కాస్తంత ఊరట. డోర్ డెలివరీల్లో ఉన్న లోపాన్ని తెలంగాణ ఆర్టీసీ గుర్తించింది. అందుకే ఖచ్చితంగా రాఖీ రోజునే.. రాఖీలు, స్వీట్ బాక్సులను డోర్ డెలివరీ చేసే ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది.                                                       

ఆగస్టు 19వ తేదీన రాఖీ పర్వదినం. ఆ రోజున  తెలంగాణతో పాటు కర్ణాటక, మహారా ష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో రాఖీలు,స్వీట్ బాక్సులను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించుకుంది. బుకింగ్‌ల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనుంది.  రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందే ప్రత్యేక కౌంటర్లు తెరవాలని అధికారులు భావిస్తున్నారు. కేవలం రాఖీలే కాదు.. వాటితో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రిని కూడా డెలివరీ  చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను డెలివరీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా కార్గో సర్వీసులు నిర్వహిస్తున్న అన్ని డిపోల్లో  ఏర్పాట్లు చేస్తున్నారు.  బుక్ చేసుకున్న 24 గంటల్లోనే గమ్యస్థానానికి చేరవేయనన్నారు.               

ఇప్పటికే కార్గో సేవలు అందిస్తున్న టీజీఎస్ఆర్టీసీ.. ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి సేవలు అందిస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా   శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను డోర్ డెలివరీ చేశారు.  నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు.  విశిష్టమైన ఈ తలంబ్రాల కోసం చాలా మంది ఎదురు చూస్తూంటారు.  వీటిని భక్తుల ఇంటికి చేర్చే ప్రక్రియన ుప్రతి ఏాది చేస్తోది.  ఆర్టీసీ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకుంది. కనీసం లక్షన్నర మందికి ఇలా ఇలా తలంబ్రాలు డోర్ డెలివరీ చేసింది. 

ఇప్పుడు అదే స్ఫూర్తిగా.. రాఖీల్ని, స్వీట్ బాక్సుల్ని కూడా  ఖచ్చితంగా రాఖీ పౌర్ణమి రోజునే డెలివరీ చేసేందుకు సిద్ధమయింది. ఆర్టీసీకి పూర్తి స్థాయిలో నెట్ వర్క్ ఉండటంతో ఇటీవలి కాలంలో ప్రైవేటు సంస్థల కంటే వేగంగా డెలివరీలు అందిస్తోంది. ఈ రాఖీ డెలివరీలను కూడా సక్సెస్ చేస్తామనే నమ్మకంతో టీజీఎస్ఆర్‌టీసీ ఉంది.               

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
Embed widget