Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Telangana News in Telugu: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
54 Corporation chairpersons cancelled by Congress govt: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వ (BRS) హయాంలో నియమించిన కార్పొరేషన్ ఛైర్మన్లను తొలగిస్తూ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నిర్ణయం మేరకు ఉత్వర్వులు జారీ చేశారు.
Appointments of 54chairpersons made by BRS govt cancelled by Congress govt pic.twitter.com/kDrYEtRZMX
— Naveena (@TheNaveena) December 10, 2023
ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు..
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలను కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్వర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో సలహాదారులుగా నియమితులైన సోమేష్ కుమార్, రాజీవ్ శర్మ, సోమేష్ కుమార్, ఏకే ఖాన్, అనురాగ్ శర్మ, జీఆర్ రెడ్డి, ఆర్ శోభ నియామకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత ప్రభుత్వం నియమించిన చైర్మన్లు, సలహాదారులను తొలగించడం జరుగుతుంది. ఈ క్రమంలో గత వారం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో బీఆర్ఎస్ హయాంలో నియమించిన కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డి. ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.
రాజీనామా చేసిన కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..
1. సోమ భరత్ కుమార్ - చైర్మన్, రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్
2. జూలూరి గౌరీ శంకర్ - చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ
3. పల్లె రవి కుమార్ గౌడ్ - చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్
4. డాక్టర్ ఆంజనేయ గౌడ్ - చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ
5. మేడె రాజీవ్ సాగర్ - చైర్మన్, TS Foods Corporation
6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ - చైర్మన్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ
7. గూడూరు ప్రవీణ్ - చైర్మన్, టైక్స్టైల్స్ కార్పొరేషన్
8. గజ్జెల నగేష్ - చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్
9. అనిల్ కూర్మాచలం - చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్
10.రామచంద్ర నాయక్ - చైర్మన్, ట్రైకార్
11. వలియా నాయక్ - చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ
12. వై సతీష్ రెడ్డి - చైర్మన్,
13. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ - చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
14. రవీందర్ సింగ్ - చైర్మన్, పౌర సరఫరాల సంస్థ
15. జగన్మోహన్ రావు - చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్