News
News
X

Tech Layoffs: జనవరి నుంచి లక్షల సంఖ్యలో ఉద్యోగాల కోత,లేఆఫ్‌లలో రికార్డుల మోత

Tech Layoffs: ఈ ఏడాది జనవరి నుంచే లక్షల సంఖ్యలో ఉద్యోగాలకు కోత పడింది.

FOLLOW US: 
Share:

Tech Layoffs 2023: 

1.5 లక్షల ఉద్యోగాలు ఉఫ్..

ద్రవ్యోల్బణ భయంతో దాదాపు బడా కంపెనీలన్నీ లేఆఫ్‌లు మొదలు పెట్టాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉద్యోగులను ఇంటికి పంపే ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం...ఈ ఏడాది జనవరి నుంచే టెక్ కంపెనీలు, యూనికార్న్స్, అంకుర సంస్థలు మొత్తంగా 1.53 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ లెక్కన చూస్తే రోజుకి 2,700 మంది లేఆఫ్‌కు గురవుతున్నారు. ఉద్యోగాలు పోయి కొందరు బాధ పడుతుంటే మరి కొందరు జీతాల్లేక అవస్థలు పడుతున్నారు. కొన్ని కంపెనీలు తమ ఎంప్లాయీస్‌కు జీతాలివ్వకుండా ఆపేస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు వేతనాల్లో కోత పెడుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సహా అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవడం వల్ల సంస్థలన్నీ ఆందోళన చెందుతున్నాయి. ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు. అందుకే పెద్ద మొత్తంలో లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను నిలిపివేశాయి. Trueup.io డేటా ప్రకారం...ప్రపంచవ్యాప్తంగా 534 కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. గతేడాదిలో 2.41 లక్షల మంది ఉద్యోగులు లేఆఫ్‌లకు బలి అయ్యారు. రోజుకి 1,535 మంది జాబ్‌లు పోయాయి. 

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటాతో మొదలైన ఈ ట్రెండ్...అన్ని కంపెనీలకు విస్తరించింది. ఇప్పుడు మరోసారి మెటా కంపెనీ లేఆఫ్‌లు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. Financial Times రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా పలు టీమ్‌లకు అవసరమైన బడ్జెట్‌ను రిలీజ్ చేయలేదు. అంటే...ఇన్‌డైరెక్ట్‌గా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు సంకేతాలిచ్చింది. ఉద్యోగులను తొలగించిన తరవాతే బడ్డెట్‌లు విడుదల చేయాలని భావిస్తోంది యాజమాన్యం. ఇప్పటికే ఉద్యోగుల్లో లేఆఫ్‌ల భయం మొదలైంది. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో అని కంగారు పడిపోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఒకేసారి 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం సంచలనమైంది. ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది 13%. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో మొత్తంగా కలిపి 11 వేల మందిని ఇంటికి పంపింది మెటా. ఇటీవలే జుకర్‌ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తమకు ఎంతో కీలకమని చెప్పారు. మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. ఇలా పలు మార్గాల్లో తమ డబ్బును ఆదా చేస్తున్నాయి.  ఇప్పుడు ఈ జాబితాలోకి డిస్నీ కూడా చేరిపోయింది.  ఎంటర్టైన్మెంట్ దిగ్గజంగా వెలుగొందుతున్న డిస్నీ 7,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని సీఈఓ బాబ్ ఐగర్ తీసుకున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది. గతేడాది డిసెంబరులో కంపెనీ పగ్గాలను ఆయన తీసుకున్నారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను అంత తేలిగ్గా తీసుకోలేదని సీఈఓ బాబ్ ఐగర్ తెలిపారు. వినియోగదారులు ఖర్చులను తగ్గించడంతో గత త్రైమాసికంలో తమ స్ట్రీమింగ్ సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్యలో చాలా మార్పు వచ్చిందన్నారు. భారీగా సబ్‌స్క్రైబర్స్ తగ్గిపోయారని కంపెనీ తెలిపింది. అంతకు ముందు కంపెనీ కస్టమర్ల సంఖ్య పెరిగింది. 

Also Read: Jammu Kashmir: కశ్మీర్‌లో మరోసారి ఉగ్ర అలజడి, సెక్యూరిటీ గార్డ్‌పై కాల్పులు - చావు బతుకుల్లో బాధితుడు

Published at : 26 Feb 2023 12:43 PM (IST) Tags: Tech Layoffs Tech Layoffs 2023 Layoffs 2023

సంబంధిత కథనాలు

Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!

Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

1980లో ఇందిరా గాంధీకి సంపూర్ణ మెజారిటీ- ప్రధాని మోదీ, షా గుర్తుంచుకోండి!: భట్టి విక్రమార్క

1980లో ఇందిరా గాంధీకి సంపూర్ణ మెజారిటీ- ప్రధాని మోదీ, షా గుర్తుంచుకోండి!: భట్టి విక్రమార్క

Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

MP R Krishnaiah : ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి- ఎంపీ ఆర్ కృష్ణయ్య

MP R Krishnaiah :  ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి- ఎంపీ ఆర్ కృష్ణయ్య

టాప్ స్టోరీస్

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!

Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!