Cabinet: నమో 2.0: మోదీ నయా టీమ్ ఇదే.. కొత్తగా 36 మందికి ఛాన్స్‌

ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన టీంను పూర్తిగా మార్చేశారు. యువతకు ఎక్కువ అవకాశం ఇచ్చారు. 36 మందిని కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చారు.

FOLLOW US: 

ప్రధాని నరేంద్ర మోదీ కొత్త టీమ్ రెడీ అయిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన తొలి మంత్రివర్గ విస్తరణలో మోదీ భారీ మార్పులే చేశారు మోదీ. 36 మందిని కొత్తగా తీసుకొని మరికొందరికి ప్రమోషన్​ కూడా ఇచ్చారు.

భారీ మార్పులు..

గత రెండేళ్లలో మంత్రుల పనితీరు, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేబినెట్​లో బుధవారం భారీ మార్పులు చేశారు. పనితీరు సరిగా లేని, క్రియాశీలకంగా వ్యవహరించని డజను మంది మంత్రులను పక్కనపెట్టారు. సహాయ మంత్రులుగా ఉంటూనే పనితీరుతో మెప్పించినందుకు నలుగురు స్వతంత్ర మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులకు ప్రమోషన్ ఇచ్చారు. 

తాజా విస్తరణతో కేంద్ర మంత్రిమండలిలోకి కొత్త మంత్రులు రావడమే కాకుండా ఇప్పటికే ఉన్న మంత్రుల‌్లోనూ కొందరికి శాఖలు మారాయి. ఇప్పటి వరకు స్వతంత్ర హోదా, సహాయ మంత్రి హోదాలో ఉన్న కొందరికి కేబినెట్ మంత్రి హోదా దక్కింది.

మొత్తం 77..

విస్తరణకు ముందు మోదీ మంత్రి మండలిలో 53 మంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 77కి చేరింది. బుధవారం 43 మంది ప్రమాణ స్వీకారం చేయగా అందులో 36 మందిని కొత్తగా వచ్చిన వాళ్లే. 

కిషన్​ రెడ్డికి ప్రమోషన్..

ప్రమోషన్ అందుకున్నవారిలో తెలంగాణకు చెందిన జి.కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయనతోపాటు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకుర్, ఆర్.కె.సింగ్, హర్‌దీప్ సింగ్ పురి, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా ఉన్నారు.

కొత్తగా మంత్రులైనవారిలో అసోంకు చెందిన సర్వానంద్ సోనోవాల్, తమిళనాడుకు చెందిన ఎల్.మురుగన్ ప్రస్తుతం పార్లమెంటు సభ్యులుగా లేరు. కాగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 

తాజా కేంద్ర మంత్రి మండలి..

కేబినెట్

 1. నరేంద్ర మోదీ- ప్రధాన మంత్రి
 2. రాజ్‌నాథ్ సింగ్- రక్షణ శాఖ
 3. అమిత్ షా- హోం, సహకార
 4. నిర్మల సీతారామన్- ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
 5. ఎస్.జయశంకర్- విదేశీ వ్యవహారాలు
 6. నితిన్ గడ్కరీ- రహదారి రవాణా, జాతీయ రహదారులు
 7. నరేంద్ర సింగ్ తోమర్- వ్యవసాయం, రైతుల సంక్షేమం
 8. ప్రహ్లాద్ జోషి- పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనులు
 9. గజేంద్ర సింగ్ షెకావత్- జల శక్తి
 10. స్మృతి ఇరానీ- మహిళ, శిశు సంక్షేమం
 11. పీయూష్ గోయల్ -వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారం, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు, జౌళి
 12. అర్జున్ ముండా- గిరిజన వ్యవహారాలు
 13. ధర్మేంద్ర ప్రధాన్- విద్య, నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికం
 14. నారాయణ్ రాణె- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
 15. సర్వానంద్ సోనోవాల్- ఓడ రేవులు, నౌకాయానం, జలమార్గాలు, ఆయుష్ శాఖ
 16. ముఖ్తార్ అబ్బాస్ నక్వీ- మైనారిటీ వ్యవహారాలు
 17. వీరేంద్ర కుమార్- సామాజిక న్యాయం, సాధికారత
 18. గిరిరాజ్ సింగ్ -గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
 19. జ్యోతిరాదిత్య సింథియా- పౌర విమానయానం
 20. రామచంద్ర ప్రసాద్ సింగ్- ఉక్కు
 21. అశ్విని వైష్ణవ్- రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్
 22. పశుపతి కుమార్ పారస్- ఆహార శుద్ధి పరిశ్రమలు
 23. కిరణ్ రిజిజు -న్యాయ శాఖ
 24. రాజ్ కుమార్ సింగ్- విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరులు
 25. హర్‌దీప్ సింగ్ పురి- పెట్రోలియం, సహజవాయువు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం
 26. మాన్‌సుఖ్ మాండవీయ- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువులు
 27. భూపేందర్ యాదవ్ -పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు, కార్మిక, ఉపాధి
 28. మహేంద్రనాథ్ పాండే- భారీ పరిశ్రమలు
 29. పురుషోత్తం రూపాలా- మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ
 30. జి.కిషన్ రెడ్డి- సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
 31. అనురాగ్ ఠాకుర్- సమాచార, ప్రసార శాఖలు, క్రీడలు, యువజన వ్యవహారాలు

స్వతంత్ర హోదా సహాయ మంత్రులు

 1. రావ్ ఇంద్రజిత్ సింగ్- ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు(స్వతంత్ర హదా). కార్పొరేట్ వ్యవహారాలు(సహాయ హోదా)
 2. జితేంద్ర సింగ్- శాస్త్ర, సాంకేతికాభివృద్ధి, భూవిజ్ఞాన శాస్త్రం(స్వతంత్ర హోదా). ప్రధాని కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షం(సహాయ హోదా)

సహాయ మంత్రులు

 • శ్రీపాద యశో నాయక్- ఓడ రేవులు, నౌకాయానం, జల మార్గాలు, పర్యటకం
 • ఫగన్ సింగ్ కులస్థె- ఉక్కు, గ్రామీణాభివృద్ధి
 • ప్రహ్లాద్ సింగ్ పటేల్- జల్ శక్తి, ఆహార శుద్ధి పరిశ్రమలు
 • అశ్విని కుమార్ చౌబె- పర్యావరణం, అడవులు, వాతావరణ శాఖ
 • అర్జున్ రామ్ మేఘ్‌వాల్- పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతికం
 • వీకే సింగ్- రహదారి రవాణా, జాతీయ రహదారులు, పౌర విమానయానం
 • క్రిషన్ పాల్- విద్యుత్, భారీ పరిశ్రమలు
 • దన్వే రావ్ సాహెబ్ దాదా రావ్- రైల్వే, బొగ్గు గనులు
 • రామ్‌దాస్ అథావలె- సామాజిక న్యాయం, సాధికారత
 • సాధ్వి నిరంజన్ జ్యోతి- వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి
 • సంజీవ్ కుమార్ బాల్యాన్- మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ
 • నిత్యానంద్ రాయ్- హోం
 • పంకజ్ చౌదరి- ఆర్థిక
 • అనుప్రియ పటేల్- పరిశ్రమలు, వాణిజ్యం
 • ఎస్.పి.సింగ్ బఘేల్- న్యాయ
 • రాజీవ్ చంద్రశేఖర్- నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికం, ఎలక్ట్రానిక్స్, ఐటీ
 • శోభ కరంద్లాజె- వ్యవసాయం, రైతుల సంక్షేమం
 • భానుప్రతాప్ సింగ్ వర్మ- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
 • దర్శన విక్రమ్ జర్దోస్- జౌళి, రైల్వే
 • వి.మురళీధరన్- విదేశీ వ్యవహారాలు
 • మీనాక్షి లేఖి- విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక
 • సోమ్ ప్రకాశ్- వాణిజ్యం, పరిశ్రమలు
 • రేణుక సింగ్ సరూతా- గిరిజన వ్యవహారాలు
 • రామేశ్వర్ తేలి- పెట్రోలియం, సహజ వాయు, కార్మక ఉపాధి
 • కైలాస్ చౌదరి- వ్యవసాయం, రైతుల సంక్షేమం
 • అన్నపూర్ణ దేవి- విద్య
 • ఎ.నారాయణస్వామి- సామాజిక న్యాయం, సాధికారత
 • ప్రతిమ భౌమిక్- సామాజిక న్యాయం, సాధికారత
 • సుభాష్ సర్కార్- విద్య
 • భగవత్ కిషన్ రావ్ కరాడ్- ఆర్థిక
 • రాజ్ కుమార్ రంజన్ సింగ్- విదేశీ వ్యవహరాలు, విద్య
 • భారతి ప్రవీణ్ పవార్- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
 • విశ్వేశ్వర్ టుడు- గిరిజన వ్యవహారాలు జలశక్తి
 • శంతన్ ఠాకుర్- ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాలు
 • ముంజపర మహేంద్రబాయి- మహిళ, శిశు సంక్షేమం, ఆయుష్
 • జాన్ బార్ల- మైనారిటీ వ్యవహారాలు
 • ఎల్. మురుగన్- మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, సమాచారచ, ప్రసార
 • నిశిత్ ప్రామాణిక్- హోం, యువజన వ్యవహారాలు, క్రీడలు
 • కౌశల్ కిశోర్- గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి
 • అజయ్ భట్- రక్షణ, పర్యటకం
 • బీఎల్ వర్మ- ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార
 • అజయ్ కుమార్- హోం
 • దేవ్ సిన్హా చౌహాన్- కమ్యూనికేషన్స్
 • భగవంత కుబ- ఎరువులు, రసాయనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు
 • కపిల్ మోరేశ్వర్ పాటిల్- పంచాయతీ రాజ
Published at : 08 Jul 2021 11:20 AM (IST) Tags: modi cabinet cabinet cabinet expansion modi cabinet news

సంబంధిత కథనాలు

Chandra Babu On Jagan: మూడేళ్లలో లక్షా 75 వేల కోట్ల అవినీతి- జగన్‌పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

Chandra Babu On Jagan: మూడేళ్లలో లక్షా 75 వేల కోట్ల అవినీతి- జగన్‌పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

King Cobra Man: ఆయన్ని చూస్తే కింగ్‌ కోబ్రాలు సెల్యూట్ చేస్తాయి

King Cobra Man: ఆయన్ని చూస్తే కింగ్‌ కోబ్రాలు సెల్యూట్ చేస్తాయి

KCR Entered The Field : ‘టైమ్‌’ లేదబ్బా..అర్థమవుతోందా ? ప్రగతి భవన్‌లో వినిపిస్తున్న మాట ఇదేనట!

KCR Entered The Field : ‘టైమ్‌’ లేదబ్బా..అర్థమవుతోందా ? ప్రగతి భవన్‌లో వినిపిస్తున్న మాట ఇదేనట!

Bandi Vs KCR : తెలంగాణలో "లెక్క"లు మారుతాయా? ఎవరి అవినీతి ఎవరు వెలికి తీస్తారు?

Bandi Vs KCR : తెలంగాణలో

Crime News: కూతుళ్లతోనే ప్రియుడి భార్య హత్యకు స్కెచ్‌- సీరియల్స్‌ విలన్స్‌కు మించిన కంత్రీ ప్లాన్‌ ఇది!

Crime News: కూతుళ్లతోనే ప్రియుడి భార్య హత్యకు స్కెచ్‌- సీరియల్స్‌ విలన్స్‌కు మించిన కంత్రీ ప్లాన్‌ ఇది!

టాప్ స్టోరీస్

Pavitra Lokesh: నరేష్ ఎవరో తెలీదు, ఆ ఆధారం ఒక్కటే లేదు, పవిత్ర నన్ను క్షమించు - భర్త సుచేంద్ర ప్రసాద్

Pavitra Lokesh: నరేష్ ఎవరో తెలీదు, ఆ ఆధారం ఒక్కటే లేదు, పవిత్ర నన్ను క్షమించు - భర్త సుచేంద్ర ప్రసాద్

Happy Birthday MS Dhoni: తుఫాన్ ఎదురొచ్చినా తలొంచని తత్వం - మహేంద్రుడి సొంతం!

Happy Birthday MS Dhoni: తుఫాన్ ఎదురొచ్చినా తలొంచని తత్వం - మహేంద్రుడి సొంతం!

Cooking Oil Prices: గుడ్‌ న్యూస్‌! భారీగా తగ్గనున్న వంట నూనెలు, పప్పుల ధరలు!

Cooking Oil Prices: గుడ్‌ న్యూస్‌! భారీగా తగ్గనున్న వంట నూనెలు, పప్పుల ధరలు!

Tapsee Pannu: తాప్సీలా మీరు నిల్చోగలరా? అమ్మో కష్టమే

Tapsee Pannu: తాప్సీలా మీరు నిల్చోగలరా? అమ్మో కష్టమే