అన్వేషించండి

Andhra News: 'హూ కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, అవినీతిపై సినిమా తియ్యొచ్చు కదా' - ఆర్జీవీపై లోకేశ్ సెటైర్లు

Nara Lokesh: ఆర్జీవీ తీసిన 'వ్యూహం' చిత్రానికి ప్రతి వ్యూహం ఉండకూడదా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మపై సెటైర్లు వేశారు.

Nara Lokesh Comments on RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తీసిన 'వ్యూహం' (Vyuham) సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. మంగళగిరి (Mangalagiri) పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. వ్యూహం చిత్రానికి ప్రతి వ్యూహం ఉండకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జీవీపై సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. ఇలాంటి సినిమాలను సీఎం జగన్ ప్రోత్సహిస్తూ, డబ్బులు పంచుతున్నారని విమర్శించారు. 'దర్శకుడు ఆర్జీవీ తరఫున కోర్టుల్లో వాదిస్తున్నదీ వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డే. ఆ న్యాయవాదులను చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. న్యాయపరంగా మాకు ఉన్న హక్కుల కోసమే పోరాడుతున్నాం. ఆర్జీవీ నిజంగా సినిమా తీయాలనుకుంటే హూ కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్ లో జరుగుతున్న అవినీతిపై సినిమా తియ్యొచ్చు కదా.' అంటూ సలహా ఇచ్చారు.

రెడ్ బుక్ పై ఏమన్నారంటే.?

రాష్ట్రంలో చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో రాస్తున్నామని లోకేశ్ తెలిపారు. తప్పు చేసిన వారి గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు.?. 'అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా.? సీఐడీనే స్క్రిప్ట్ రాసివ్వమనండి. అదే చదువుతా. లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్లు స్క్రిప్ట్ రాసిస్తే అదే చదువుతా. కొల్లి రఘురామిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు వంటి వారు తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నారా.? రెడ్ బుక్ లో ఎవరి పేర్లున్నాయో వారికెలా తెలుసు.?' అంటూ ప్రశ్నించారు.

వైసీపీపై విమర్శలు

రాబోయే ఎన్నికల్లో ఓడిపోయే స్థానాల్లోనే వైసీపీ, బీసీలకు సీట్లు ఇస్తోందని లోకేశ్ విమర్శించారు. వైసీపీలో తమకు గుర్తింపు లేదని స్వయంగా ఆ పార్టీ బీసీ ఎమ్మెల్యే పార్థసారథి చెప్పారని అన్నారు. మంగళగిరిలో ఓడిపోతున్నామనే తెలిసే ఇప్పుడు బీసీలకు ఇచ్చారని, గతంలో రెండుసార్లు రెడ్డిలకు ఇచ్చారని గుర్తు చేశారు. కడప ఎంపీ స్థానం, పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని సవాల్ విసిరారు. 'చిలకలూరిపేటకు పనికి రాని మంత్రి విడదల రజనీ గుంటూరు వెస్ట్ లో ఎలా పనికొస్తారు.?. ఓ నియోజకవర్గంలో చెత్త, మరో చోట బంగారం అవుతుందా.?' అని నిలదీశారు.

జనవరి 4 నుంచి 'జయహో బీసీ'

రాష్ట్రంలో జనవరి 4 నుంచి 'జయహో బీసీ' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. సీఎం జగన్ (CM Jagan) బీసీల ద్రోహి అని, వైసీపీ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాలపై వారిలో చైతన్యం కల్పించేందుకే ఈ కార్యక్రమం అని చెప్పారు. 2 నెలల పాటు 'జయహో బీసీ' (Jayaho BC) కొనసాగుతుందని, తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బటన్ నొక్కితే బీసీ సర్టిఫికెట్ అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బీసీలకు అవసరమైన ఇన్ పుట్ సబ్సిడీ, వారికి అనుకూల విధానాలు రూపొందిస్తామన్నారు.

Also Read: Andhra News: జనవరి 4 నుంచి 'జయహో బీసీ' - బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామన్న నారా లోకేశ్

 

 

టాప్ హెడ్ లైన్స్

SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget